రేవంత్ పై పవన్ కొత్త అస్త్రం, ఢిల్లీ మార్క్ గేమ్ - కీలక మలుపు..!!

తెలంగాణ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. జూబ్లీహిల్స్.. పంచాయితీ ఎన్నికల ఫలితాలే మున్సిపాల్టీల్లోనూ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలో గ్రేటర్ పరిధిలోనూ ఎన్నికలు జరగాల్సి ఉంది. గ్రేటర్ పునర్విభజన ద్వారా కాంగ్రెస్ కొత్త స్కెచ్ వేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ అప్రమత్తం అయ్యాయి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త సమీకరణాల దిశగా కనిపిస్తోంది. రేవంత్ లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైంది.

తెలంగాణ రాజకీయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ త్వరలో జరిగే మున్సిపల్.. ఆ తరువాత గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ తీయటమే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ ముందస్తుగానే ఫోకస్ చేసారు. గ్రేటర్ విస్తరించి 300 వార్డులు చేసారు. దీంతో.. గ్రేటర్ లో పట్టు కోసం.. గత ఫలితాల్లో బలం చాటిన విధంగా గ్రేటర్ పైన జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్..బీజేపీ భావిస్తున్నాయి.

pawan-kalyan-big-decision-over-janasena-in-telangana-ahead-municipal-polls

దీంతో, జూబ్లీహిల్స్ లో ఓటింగ్ సమీకరణాలు చూసిన బీజేపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది. ఏపీలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో కలిసి హైదరాబాద్ లో పోటీ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి కర నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీలను పవన్ రద్దు చేసారు. వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం దిశగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్ రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గ్రేటర్ తో పాటుగా వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియామకం చేయనున్నారు. 30 రోజుల పాటు అడ్ హాక్ కమిటీ పని చేస్తుందని వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గం, GHMC 300 వార్డుల్లో పర్యటించి నుంచి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి ఈ అడ్ హాక్ కమిటీ సభ్యులు తీసుకు రానున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చేసేలా నూతన కమిటీల ప్రకటన ఉంటుందని ప్రకటించారు. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవటం ద్వారా కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గ్రేటర్ లో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+