రేవంత్ తో పవన్ భేటీ - కీలక మంత్రాంగం..!!
సీఎం రేవంత్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ తొలి సారి రేవంత్ తో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వరదలతో నష్టపోయాయి. రెండు రాష్ట్రాలకు పవన్ ఆర్దిక సాయం ప్రకటించారు. అదే సమయంలో రేవంత్ హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్న హైడ్రా కూల్చివేతలకు పవన్ మద్దతిచ్చారు. ఇప్పుడు ఈ సమావేశంలో ఇద్దరి మధ్య కీలక అంశాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రేవంత్ తో పవన్ భేటీ
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితులకు సహాయం కోసం పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఇటీవల సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి రూ .కోటి చెక్ ను అందజేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి కోటి రూపాయాల చెక్ ను పవన్ అందచేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ తో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

రూ కోటి చెక్కు అందచేత
పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ కోటి చొప్పున సాయం ప్రకటించటంతో పాటుగా 400 గ్రామ పంచాయితీలకు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. 400 గ్రామ పంచాయితీలకు ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మేరకు నిధులు అందించారు. ఇక..హైదరాబాద్ లో రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న హైడ్రా అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. దీని పైన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
హైడ్రా పై వ్యాఖ్యలు
హైడ్రా నిర్ణయాన్ని పవన్ స్వాగతించారు. చెరువుల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. పూర్తిగా కట్టేసిన తరవాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఏపీలోనూ పరీవాహక ప్రాంతాలు పరిరక్షించుకోవాలి అనేదానిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకువస్తే మంచిదే.. కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications