పవన్ కల్యాణ్ యాత్రలో అపశ్రుతి: "పవన్ ఎక్కడున్నారు"
ఖమ్మం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖమ్మం రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పవన్ కల్యాణ్‌పైకి చెప్పు విసరడం మాట అటుంచితే ఓ ఎస్సై కాలు విరిగింది.
పవన్ కల్యాణ్ అభిమానుల అత్యుత్సహం వల్ల ఖమ్మం రూరల్ ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి వచ్చిన వెంటనే ఆయనను సమీపించేందుకు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

అత్యుత్సాహంలో ఇలా...
పవన్ కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. దాంతో పవన్ కల్యాణ్ అభిమానులంతా ఓ వైపు పరుగులు తీశారు.

అలా అదుపు చేస్తుండగా...
లాఠీచార్జీ చేస్తున్న సమయంలో ఎస్సీ చిరంజీవి మరికొందరిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో చిరంజీవి కాలు మాత్రమే కాకుండా ఓ పవన్ కల్యాణ్ అభిమాని కాలు కూడా విరిగింంది.

పవన్‌పై మండిపడిన గజ్జెల కాంతం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం తీవ్రంగా మండిపడ్డారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగినప్పుడు పవన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.

రైతులకు బేడీలు వేసినప్పుడు
ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని గజ్జెల కాంతం అడిగారు. తెలంగాణలో తిరిగేందుకు పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలను మోసం చేయడానికే...
ప్రజలను మోసం చేయడానికే వవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని గజ్జెల కాంతం విమర్సించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు దమ్ముంటే పవన్ కల్యాణ్ బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.

ఉద్యమంలో అలా జరిగితే...
తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయి, మరెంతో మంది జైలుకు వెళ్తే పట్టించుకోని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని గజ్జెల కాంతం ప్రశ్నించారు. తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి పవన్ యాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్‌కు లేదని అన్నారు.












Click it and Unblock the Notifications