సర్ మీరంటే నాకు ఎంతో గౌరవం: పవన్ ఫాలో అవుతున్న ఒకే ఒక వ్యక్తి ఇతనే!
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో 3.2 మిలియన్ల పాలోవర్లు ఉన్నారు. తన ట్విట్టర్ అకౌంటులో ఆయన ఎవరినీ ఫాలో కావడం లేదు! ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. అది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.
పవన్ కళ్యాణ్‌కు ట్విటర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలు ఉన్నాయి. వాటిని తన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి వాడుతుంటారు. కానీ వ్యక్తిగత విషయాలను తక్కువగా పోస్టు చేస్తారు.

ఈ సందర్భంగా అమితాబ్‌ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు. గౌరవనీయ అమితాబ్ బచ్చన్ గారు.. మీరంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం సర్... స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు సెల్యూట్ చేస్తూ నేను చేసిన పోస్ట్‌ను మీరు రీట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు. ఆ పోస్ట్ పోయెమ్స్ ఆఫ్ లవ్ అండ్ వార్ పుస్తకం లోనిది. ఈ పుస్తకాన్ని ఏకే రామానుజన్ అనే రచయిత తమిళం నుంచి ఇంగ్లీష్ నుంచి అనువదించారు. జైహింద్ సర్ అని ట్వీట్ చేశారు.
Hon.Shri Amitabh Bachchan ji..🙏 Thank you Sir! pic.twitter.com/khTdOMVAra
— Pawan Kalyan (@PawanKalyan) August 18, 2018
కాగా, పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆర్మీ సత్తాని, గొప్పదనాన్ని వివరించే కొన్ని సందేశాల్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందరిని విపరీతంగా ఆకర్షించింది. భారత దేశ ఆర్మీ గురించి ప్రముఖులు ఆర్మీ అధికారులు పలు సందర్భాల్లో తెలిపిన మాటలు అవి. పవన్ ట్వీట్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని కూడా ఫిదా చేసింది.
పవన్ చేసిన ట్వీట్ కు అమితాబ్ ధన్యవాదాలు చెబుతూ రీట్వీట్ చేశారు. దీనితో పవన్ కళ్యాణ్ ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. పవన్ దేశ భక్తిని గుర్తించిన అమితాబ్ కు పవన్ ఫాన్స్ వరుసగా కృతజ్ఞతలు చెబుతూ రిప్లై ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications