పవన్ కుమారుడికి గాయాలు.. సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు. సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 ఏళ్ల మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి... శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్... సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడటం... దిగ్భ్రాంతికి గురి చేసింది. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి…
— Revanth Reddy (@revanth_anumula) April 8, 2025
శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్
కుమారుడు మార్క్ శంకర్…
సింగపూర్ లోని పాఠశాలలో
జరిగిన ప్రమాదంలో గాయపడటం…
దిగ్భ్రాంతికి గురి చేసింది.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని
ఆకాంక్షిస్తున్నాను.@PawanKalyan
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే, ఆయన తన పర్యటనను ముగించుకుని సింగపూర్ బయలుదేరనున్నారు.












Click it and Unblock the Notifications