వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ గట్టు మీద పవన్ కల్యాణ్ పర్యటన.. ఆ కుటుంబాలకు భరోసా

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంపైనా ఫోకస్ చేశారు. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రమాదవశాత్తు చనిపోయిన జనసైనికుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారం పది రోజుల్లో చౌటుప్పల్, హుజూర్ నగర్‌లో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని జనసేన నేతలు తెలిపారు. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేన పార్టీ దృష్టి సారిస్తుందని చెప్పారు. పవన్ తెలంగాణ పర్యటనకు సంబంధించి లేఖను పార్టీ విడుదల చేసింది.

రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. నేరుగా మృతుల కుటుంబాలు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం, ఆర్థిక సాయం అందిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి యాత్ర ప్రారంభించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందజేశారు.

pawan kalyan to tour to telangana state

సమాచార హక్కు చట్టం ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలను పార్టీ సేకరించింది. ఆ జాభితా ఆధారంగా వారి కుటుంబాలకు ఆర్ధికసాయం అందిస్తుంది. మొదటి విడతలో 80 మంది రైతులకు సాయం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేశారు. ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుడదనే ఉద్దేశంతో పర్యటన చేయనున్నారు.

వాస్తవానికి ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు లేవు. అలాగే ఏపీలో కూడా లేవు... కానీ జనసేనాని మాత్రం స్పీడ్ పెంచారు. అయితే తెలంగాణలో ముందస్తు ముచ్చట గురించి ప్రచాం జరుగుతుంది. అందుకోసమే పవన్ తెలంగాణ గట్టు వైపు లుక్కేశారు. తమ పార్టీ అభ్యర్థులను నిలిపి.. కొన్ని సీట్లు సాధించాలని ప్రణాళిక రచించారు. ఆ మేరకు పర్యటను శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తప్పిదాలు.. రైతులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తే ఛాన్స్ ఉంది.

English summary
pawan kalyan to tour telangana state nadendla manohar said. he to meet who died in accident in recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X