ఎన్నికల వేళ బాలయ్య Vs పవన్ - బీజేపీ కొత్త ఫిట్టింగ్..!!
ఎన్నికల వేళ ఆసక్తి కర పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో మిత్రులు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రత్యర్ధులుగా మారుతున్నారు. తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు ఖాయమైంది. కానీ, టీడీపీతో తెలంగాణలో ఈ రెండు పార్టీలకు పొత్తు లేనట్లే. బీజేపీ - జనసేన కూటమి తరపున పవన్ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. అటు తెలంగాణలో టీడీపీకి నందమూరి బాలకృష్ణ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ కోసం రంగంలోకి దిగుతున్నారు.
మారుతున్న సమీకరణాలు
తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు ఖాయమైంది. జనసేన తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేయాలని ముందుగా స్థానాలను ఖరారు చేసింది. బీజేపీ తెలంగాణ నేతలు పవన్ తో చర్చలు చేసి..ఎన్నికల్లో పరస్పర సహకారం కోసం ప్రతిపాదించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని పవన్ సూచించారు. ఈ మేరకు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పవన్ ఢిల్లీలో సమావేశం అయ్యారు.

జనసేనకు 20 సీట్లు కేటాయించాలని కోరారు. దీని పైన రాష్ట్ర నాయకత్వంతో చర్చించి...27న తాను హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో చెప్పాలని..అప్పుడు తుది నిర్ణయం తీసుకుందామని సూచించారు. బీజేపీ 3-6 సీట్ల వరకు జనసేనకు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఏపీలో భవిష్యత్ రాజకీయ లక్ష్యాల కోసం తెలంగాణలో బీజేపీ ప్రతిపాదనలకు పవన్ సిద్దమైనట్లు పార్టీ నేతల సమాచారం.
ఇక్కడ మిత్రులు..అక్కడ మాత్ర
జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేసినా..పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న వారాహి యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తెలంగాణలో పార్టీ పోటీ చేసే స్థానాలతో పాటుగా..జాతీయ నాయకత్వం పాల్గొనే ఎంపిక చేసిన బహిరంగసభల్లోనూ పాల్గొంటారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తోంది. ఇక్కడ ఇక ఈ రెండు పార్టీలతో టీడీపీ కలిసే అవకాశం లేదు.
ఇటు టీడీపీ పోటీ పైన అధికారికంగా ప్రకటక రాకపోయినా..పోటీకి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ రోజు లేదా రేపు చంద్రబాబు తెలంగాణలో పోటీతో పాటుగా అభ్యర్దుల విషయం లోనూ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. తెలుగుదేశం పోటీ చేయకపోతే..రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ కు మేలు చేసేందుకే దూరంగా ఉన్నారనే విమర్శ వచ్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ ఆలోచనల్లో.. పరోక్షంగా జనసేన పైన ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందనేది విశ్లేషకలు అంచనా.
ప్రచారంలో పవన్ - బాలయ్య
దీంతో, టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల పైన నందమూరి బాలకృష్ణ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ తరపున బాలకృష్ణ ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. దీంతో, టీడీపీ తరపున బాలకృష్ణ ప్రచారం..అటు జనసేన తరపున పవన్ ప్రచారం చేయనున్నారు.
ఏపీలో కలిసి కట్టుగా సాగాల్సిన ఈ ఇద్దరు బీజేపీ నాయకత్వం నిర్ణయం కారణంగా తెలంగాణలో మాత్రం ఒక విధంగా రాజకీయ ప్రత్యర్దులుగా మారాల్సిన అవసరం కనిపిస్తోంది. బీజేపీ- జనసేనకు తెలంగాణలో టీడీపీని విమర్శించాల్సిన అవసరం ఉంచకపోవచ్చు. కానీ, టీడీపీ మాత్ర బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీని ప్రచారంలో టార్గెట్ చేయాల్సి ఉంటుంది. దీంతో..టీడీపీ పోటీ.. బాలయ్య - పవన్ ఎన్నికల ప్రచారం పైన ఇప్పుడు ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications