స్మిత సబర్వాల్ ఇష్యూ: ఔట్‌లుక్‌కు పిసిఐ నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై అనుచిత వాఖ్యలు రాసిన ఔట్‌లుక్ మ్యాగజైన్‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) నోటీసులు జారీ చేసింది. స్మితా సబర్వాల్‌పై రాసిన వాఖ్యలపై ఔట్‌లుక్ మ్యాగజైన్ సంజాయిషీ ఇవ్వాలంటూ పీసీఐ నోటీసులు జారీ చేసింది.
కాగా, స్మితా సబర్వాల్‌పై అనుచిత వాఖ్యలు రాసిన ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై చర్యలు తీసుకోవాలంటూ జనార్థన్‌గౌడ్ అనే న్యాయవాది పీసీఐని సంప్రదించారు. ఈమేరకు పీసీఐ స్పందించింది. స్మిత సబర్వాల్‌పై ఔట్‌లుక్ మ్యాగజైన్ అనుచితమైన వ్యంగ్య కథనాన్ని ప్రచురించిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

సలహాదారులకు కేబినెట్ హోదాపై విచారణ
ప్రభుత్వ సలహాదారులకు తెలంగాణ ప్రభుత్వం కాబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నల్గొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications