'ఎలా చూసినా గెలిచేది ఆ పార్టీనే'.. మరో ఎగ్జిట్ పోల్ సంచలనం..
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. పలు సర్వే సంస్థలు రిలీజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకే విజయం దక్కుతుందని స్పష్టం చేశాయి. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్ సర్వే, పబ్లిక్ పల్స్(శ్రీనివాస్), హెచ్ఎంఆర్, ఆరా మస్తాన్ తదితర సర్వేలన్నీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం గుర్తువైపునకే మొగ్గుచూపాయి. తాజాగా పీసీఎస్ సర్వే సైతం కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని వెల్లడించింది.
పీసీఎస్ సర్వే వివరాలను ఓసారి చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు పోలింగ్ అయినట్లు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 42 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపింది. ఇక బీజేపీకి 8 శాతం ఓట్లు నమోదైనట్లు అంచనా వేసింది. ఇక మిగతావారికి ఒక శాతం ఓట్లు నమోదైనట్లు వివరించింది. కాంగ్రెస్ కు ఓటింగ్ షేర్ 49 శాతం కాగా 2 శాతం మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అని తెలిపింది. అంటే 2 శాతం తగ్గొచ్చు లేదా పెరగొచ్చని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ కు 42 శాతం ఓటింగ్ షేర్ కాగా.. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2 శాతం అని స్పష్టం చేసింది. బీజేపీ కి 8 శాతం ఓట్లు వస్తాయని అలాగే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2 శాతం అని తెలిపింది. ఇక మిగతావారికి 1 శాతం ఓట్లు రాగా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ సైతం 1 శాతమేనని పీసీఎస్ సర్వే స్పష్టం చేసింది.

ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మృతి వల్ల ఉప ఎన్నిక ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలిచారు. అలాగే అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. వీరితోపాటు ఈ ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ నెల 14 న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications