పీక్ కి చేరిన క్రియేటివిటి .. జేసీబీలో ఊరేగిన జంట (వీడియో)
Recommended Video

ఖమ్మం : పాత ఒక రొత .. కొత్త ఒక వింత అనే నానుడి మరోసారి నిజమైంది. డిఫరెంట్ గా ఆలోచించేవారి చేష్టలు అలానే ఉంటాయి. సాధారణంగా పెళ్లి చేసుకొని కారులో ఊరేగితే ఏముందనుకున్నారో ఏమో ఓ జంట .. జేసీబీలో పయనించి తాము డిఫరెంట్ అని నిరూపించుకున్నారు.
వెరైటీ ఊరేగింపు
సాధారణంగా పెళ్లిక్రతువు ముగిసాక ఊరేగింపు సాంప్రదాయం తప్పనిసరి. ఇదివరకు అయితే గుర్రపు బగ్గీ, ఎడ్లబండ్ల మీద ఊరేగేవారు. కానీ ఇప్పుడు తహతుబట్టి కార్ల వినియోగం తప్పనిసరి అవడంతో ఆయా కార్లలో విహరిస్తారు. కొత్త దనం కోరుకునేవారు ఓపెన్ టాప్ జీపు, కారులను ఎంచుకుంటారు. ఖమ్మంకి చెందిన జంట కొత్తగా ఆలోచించారు. కారు మాదిరిగానే జేసీబీకి బెలూన్లు అంటించి .. డెకరేట్ చేశారు. తర్వాత జేసీబీ మట్టి తీసే కొక్కేం మీద కూర్చొని .. ఊరేగారు. వారి వెంట సపరివారం రాగా .. వెనుక కార్లలో బంధువులు, స్నేహితులు వచ్చారు. ఎన్నడూ లేనివిధంగా వీరి ఊరేగింపు ఉండటంతో ఫోటోలు, వీడియోలు తీసేందుకు జనం ఎగబడ్డారు. అలా తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

గతంలో కాంక్రీట్ మిషన్ లో భోజనాల తయారీ ..
ఇంటి స్లాబ్ కోసం పనిచేసే కాంక్రీట్ మిషన్ ను గతంలో పెళ్లి కోసం ఉపయోగించారు. కాంక్రీట్ మిషన్ లో అన్నం, కూర, చారు, తదితర మిక్స్ చేశారు. అప్పట్లో దీనిని చూసిన వారు ఆశ్చర్యపడ్డారు. మిక్స్ పూర్తయ్యాక .. ఆ ద్రవణాన్ని టాపీతో పెళ్లికి వచ్చిన వారికి వడ్డించడం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఆ పెళ్లికి వచ్చినవారు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.












Click it and Unblock the Notifications