ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ నిర్మల..
లంచాలకు మరిగిన కొంత మంది అధికారులు తీరు మారడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ నిర్మల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ తో పాటు అటెండర్ కూడా అదుపులోకి తీసుకున్నారు.
భూమికి సంబంధించి డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ ను సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల రూ.60 వేలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారుల సూచనతో శ్రీనివాస్ నిర్మలకు లంచం ఇచ్చాడు.

అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు నిర్మలతో పాటు అటెండర్ శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్ర తెలిపారు.












Click it and Unblock the Notifications