వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అధికారం ఇవ్వమంటారా?: మోత్కుపల్లిపై పెద్దిరెడ్డి, లోకేష్, సోమిరెడ్డి ఇలా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ ఆత్మహత్య శాంతించాలంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలంటూ టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. టీడీపీ జాతీయ కన్వీనర్ నారా లోకేష్, ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి కూడా మోత్కుపల్లి వ్యాఖ్యాలపై స్పందించారు.

టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనంటిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనం

మోత్కుపల్లి ఎమోషన్‌తో మాట్లాడిట్లున్నారని పెద్దిరెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ.. ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం అవుతుందని ఆయన ప్రశ్నించారు.

Recommended Video

టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి.. బాబుపై మోత్కుపల్లి సంచలనం..!
ఏపీలో అధికారం ఇవ్వమంటారా?

ఏపీలో అధికారం ఇవ్వమంటారా?

టీఆర్ఎస్ పార్టీలో టీడీపీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని టీఆర్ఎస్‌కు ఇవ్వాలా? అని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. మోత్కుపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల టీడీపీ నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారని అన్నారు.

మోత్కుపల్లి వ్యక్తిగతం: లోకేష్

మోత్కుపల్లి వ్యక్తిగతం: లోకేష్

మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ కన్వీనర్ నారా లోకేశ్‌ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఉన్నందువల్లే చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లలేదని అన్నారు.

అందుకే చంద్రబాబు రాలేదు

అందుకే చంద్రబాబు రాలేదు

ఏపీలోనూ ఎన్టీఆర్‌ వర్థంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఎన్టీఆర్‌ వర్థంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారని వివరించారు. అమరావతిలో ఎన్టీఆర్‌ విగ్రహం, మెమోరియల్‌ నిర్మాణానికి డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు.

మోత్కుపల్లిపై పరోక్షంగా సోమిరెడ్డి

మోత్కుపల్లిపై పరోక్షంగా సోమిరెడ్డి

మోత్కుపల్లి వ్యాఖ్యలను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు అధికారమే పరమావధిగా మారిందని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని అన్నారు. వామపక్ష పార్టీలు అధికారం లేకుండానే పోరాటం చేస్తున్నాయని చెప్పారు.

English summary
TTDP leader Peddireddy and TDP national convinor Lokesh responded on Motkupally Narasimhulu comments about party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X