వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదల వల్ల ప్రజల జీవనం అస్తవ్యస్తం.!ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్న ఈటల.!

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి/హైదరాబాద్ : ఇటీవల సంభవించిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజల జన జీవనం అస్త వ్యస్తంగా మారిందని, అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు విలాసాల పేరుతో విదేశాలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులు వర్షాకాలంలో ఇరిగేషన్ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి వరదలు వచ్చే సమయంలో స్విట్జర్లాండ్ టూర్ పోయారు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతోందనన్నారు. అధికారుల పర్యటనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిది కూడా తప్పే అన్నారు ఈటల రాజేందర్.

 కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం.. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ విఫలం చెందారన్న ఈటల

కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం.. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ విఫలం చెందారన్న ఈటల


కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లనే పంప్ హౌజ్ లు మునిగిపోయాయన్నారు ఈటల. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వదానికి 27 వేల రూపాయల కరెంటు ఖర్చు అవుతోందని, ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఉందా లేదా అని మాజీ ఐఏఎస్ అధికారులు అడుగుతున్నారని అన్నారు. వరదల వల్ల గోదావరి పరివాహక ప్రాంత ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని, మీడియా ఛానల్ విలేకరి మరణించడం బాధాకరమన్నారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎస్సార్ఎస్పీ నుండి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతం అంతా పర్యటించి ప్రజలకు అండగా ఉండకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు ఈటల.

 జనజీవనం దారుణంగా దెబ్బతిన్నది.. ప్రభుత్వం ఆదుకోలేకపోతుందన్న బీజేపి ఎమ్మెల్యే

జనజీవనం దారుణంగా దెబ్బతిన్నది.. ప్రభుత్వం ఆదుకోలేకపోతుందన్న బీజేపి ఎమ్మెల్యే


కేవలం ఒక్క భద్రాచలం మాత్రమే నష్టపోయినట్లు అక్కడివారికి మాత్రమే ఇల్లు కట్టిస్త అని సీఎం చెప్పడం బాధాకరమన్నారు ఈటల రాజేందర్. మంచిర్యాల మునిగింది, గూడు కరువైన వారి గోడు వినడం లేదు. మంథనిలో వేల బస్తాల బియ్యం నీళ్ళ పాలయ్యాయి. షాపులు అన్నీ నీట మునిగినాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యాయి. ఇల్లు మునిగిపోయిన వారందరికీ నష్ట తీవ్రతను అంచనా వేసి ప్రతి ఇంటికి నష్టపరిహారం చెల్లించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేసారు. సీఎం చంద్రశేఖర్ రావు ఇతరుల మీద నెపం నెట్టి భాధ్యత నుండి తప్పించుకోవాలని చూడడం దారుణమన్నారు.

 నష్ట పరిహారం ఏది..? ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ఈటల రాజేందర్

నష్ట పరిహారం ఏది..? ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ఈటల రాజేందర్


అంతే కాకుండా 1986 తరువాత ఇంత పెద్ద వరద వచ్చింది ఇప్పుడే కాబట్టి వారిని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపున తాము కూడా కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందిస్తారు అని ఆశిస్తున్నామన్నారు ఈటల. చంద్రశేఖర్ రావు అనేక సార్లు మాట ఇచ్చి నెరవేర్చలేదన్నారు ఈటల. 1986 లో గోదావరికి అతిపెద్ద వరదలు వచ్చాయని, ఎప్పుడు 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఈటల గుర్తు చేసారు. ఇప్పుడు 25 లక్షల క్యూసెక్కుల నీరు వస్తెనే పరివాహక ప్రాంతం మునిగిపోవడానికి కారణం ఎంటో ప్రభుత్వం చెప్పాలని నిలదీసారు. ఎక్కడో లోపం ఉంది కాబట్టే, గతం కంటే తక్కువ నీరు వచ్చినా మునిగిందని నిపుణులు అంటున్నారని ఈటల తెలిపారు.

 టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపికే ఉంది.. అందుకు ప్రజాధరణ పెరుగుతుందన్న ఈటల

టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపికే ఉంది.. అందుకు ప్రజాధరణ పెరుగుతుందన్న ఈటల


తానే ఇంజనీరును, తానే కాళేశ్వర సృష్టి కర్తనని చెప్పే చంద్రశేఖర్ రావు, ఢాం కట్టడం ద్వారా వచ్చే బాక్ వాటర్ ను అంచనా వేయలేదని ఆరోపించారు. నిర్మాణ లోపం వల్లనే మునిగాయని, ఇప్పటికైనా బ్యాక్ వాటర్ మీద శాస్త్రీయమైన సర్వే చేసి, ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు ఈటల. మెదిగడ్డ, అన్నారం పంప్ హౌజ్ లు మునిగి పోవడానికి నిర్మాణ లోపాలే కారణమని, తెలంగాణలో ప్రతి గ్రామం చంద్రశేఖర్ రావును ఓడ గొట్టాలని కంకణం కట్టుకొన్నారన్నారు ఈటల. చంద్రశేఖర్ రావు ఇచ్చే ప్రతి రూపాయి ప్రజలదేనని, అయన ఇంట్లో నుండి ఇవ్వడం లేదన్నారు ఈటల. చంద్రశేఖర్ రావును ఓడగొట్టీ సత్తా ఒక్క బీజేపీకే మాత్రమే ఉందని, ఆనమ్మకం ప్రజలకు వచ్చినందుకే ప్రజలందరూ ఆదరిస్తున్నారన్నారు ఈటల రాజేందర్.

English summary
BJP MLA Etala Rajender expressed his anger that due to the recent rains, the life of the people in the lowland areas has become chaotic and the government officials who are supposed to be available and provide relief programs are going abroad in the name of luxuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X