ప్రజా గాయకుడికి కన్నీటి వీడ్కోలు: అధికార లాంఛనాలతో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు

హైదరాబాద్: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ముగిశాయి. వేలాది మంది అభిమానుల మధ్య అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో.. బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. తరలివచ్చని అశేష అభిమానులు ఉద్యమవీరుడికి విప్లవ జోహార్లు సమర్పించారు.

అంతకుముందు కడసారిగా గద్దర్‌ను చూసేందుకు ఎల్బీ స్టేడియానికి సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమ యాత్ర కొనసాగింది. అల్వాల్‌లోని నివాసంలో గద్దర్ పార్థీవదేహాన్ని కొంత సమయం ఉంచారు.

people poet gaddar funeral ends: thousands of fans attended

సీఎం కేసీఆర్ నివాళి..

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి సీఎం కేసీఆర్.. ఆయ‌న కుటుంబ స‌భ్యులను ఓదార్చారు. గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని స్మరించుకున్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, చంటి క్రాంతి కిర‌ణ్‌, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు నివాళుల‌ర్పించారు.

people poet gaddar funeral ends: thousands of fans attended

అంతకుముందు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్ పార్థీవదేహానికి నివాళుతర్పించారు. విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, అలీ, ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తదితరులు నివాళులర్పించారు.

కాగా, గద్దర్ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు శోకంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం వరకు గద్దర్ పార్తీవ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచడంతో ప్రజలతోపాటు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత గద్దర్ పార్థీవదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు. ఆయన నివాసంలో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సోమవారం సాయంత్రం అల్వాల్‌లోని మహాబోధి స్కూల్‌కు తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+