విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.!ప్రధాని సభను సక్సెస్ చేద్దాం.!కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు.!
వరంగల్/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ సభను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు శుక్రవారం ఉదయం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న ఆయన.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించిన అనంత అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలొకి రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు కిషన్ రెడ్డి.
కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేస్తాం : రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నామని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారీ బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోడీ కోరనున్నారని, మంత్రులు, ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలని, బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవని, ఇతర పార్టీలు చేసే విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.















Click it and Unblock the Notifications