నగరంలో ‘కీచక’ పీఈటీ... పాఠశాల ఎదుట తల్లిదండ్రుల అందోళన
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు ‘కీచక’ అవతారం ఎత్తాడు. అభంశుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.
హైదరాబాద్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు 'కీచక' అవతారం ఎత్తాడు. అభంశుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. సదరు ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట అందోళనకు దిగారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న బండ్లగూడలో ఈ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న రాజా కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిసిన తల్లిదండ్రులు సదరు పాఠశాల వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసి పలు విద్యార్థి సంఘాలు వారికి మద్దతు తెలిపాయి.
తల్లిదండ్రులు పాఠశాల ఎదుట అందోళనకు దిగారనే సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని, పీఈటీ రాజాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై తక్షణమే తగిన చర్య తీసుకుని న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications