నల్గొండలో మెడికో ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమా?

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ వైద్య కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘురామ్ అనే పీజీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రఘురామ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణం కావొచ్చని భావస్తున్నారు.

PG student commits suicide in Nalgonda

ఆర్థిక ఇబ్బందులతో యువరైతు ఆత్మహత్య

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఓ మెదక్ జిల్లా రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి మండలం శేరిల్లలో ఆర్థిక ఇబ్బందులతో నాగమల్లయ్య అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

ముగ్గురు అన్నదమ్ముల మృతి

హైదరాబాద్‌ నుంచి పెళ్లికి వస్తున్న ముగ్గురిని ఓ కారు కబళించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట మార్గంలో స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వారు హైదరాబాద్‌ శివారుప్రాంతం బాటసింగారానికి చెందిన అన్నదమ్ములుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+