1200మంది ఫోన్లు ట్యాపింగ్; మూసీలో హార్డ్‌డిస్కులు; ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలనాలు

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో గత ఎన్నికల పోలింగ్ దాకా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇక ఈ వాంగ్మూలంలో ప్రణీత్ రావు అనేక సంచలన విషయాలను వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారో వాంగ్మూలంలో చెప్పిన ప్రణీత్ రావు
ప్రణీత్ రావు మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో 1200 మంది ఫోన్లు టాప్ చేసినట్టు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వ్యాపారస్తులు ఇలా 1200 మంది ఫోన్లు టాప్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా, 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ట్యాపింగ్ కొనసాగించాం అన్నారు.

Phone tapping case 1200 phones tapped with 56 people praneeth rao confession report

ఫోన్ ట్యాపింగ్ కోసం ఆ ల్యాబ్ సాయం
ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్నానని, అధికారికంగా మూడు ఫోన్లను ఉపయోగించానని, అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను మానిటర్ చేశానని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామని, అనంత్, శ్రీనివాస్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్యాపింగ్ చేశామన్నారు. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు.

ఆయన ఆదేశాలలో ఫోన్ ట్యాపింగ్ ఆపేశాం
పట్టుకున్న డబ్బు మొత్తాన్ని ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులలో చూపించామన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుండి ఫోన్ ట్యాపింగ్ ను ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాలతో 50కొత్త హార్డ్ డిస్క్ లను తీసుకువచ్చి, పాత వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లను ఫిక్స్ చేశామని పేర్కొన్నారు.

ఆ డిస్కులు, డేటా అంతా మూసీలో
17హార్ట్ డిస్క్ లలో అత్యంత కీలకమైన సమాచారం ఉండడంతో వాటిని కట్టర్ల సహాయంతో కట్ చేసి ధ్వంసం చేశామని పేర్కొన్నారు. సిడిఆర్ తో ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశామన్నారు. ల్యాప్ ట్యాప్ లు, పెన్ డ్రైవ్ లు, హార్ట్ డిస్క్ లలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని వెల్లడించారు. ఆపై ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు, తదితరాలను నాగోల్, ముసరాంబాగ్ సమీపంలోని మూసీనదిలో పారేశాం అన్నారు.

బేగంపేట నాలాలో మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు
తాము ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు బేగంపేట నాలాలో పారేశామని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఫోన్ టాపింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని సూచించారని, ఆయన ఆదేశాలతోనే అలా చేశామన్నారు. ప్రస్తుతం ప్రణీత్ రావ్ వాంగ్మూలంలో పేర్కొన్న సమాచారం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+