ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. చంద్రబాబు, లోకేశ్ ఫోన్లు కూడా.. !

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లతో ఫోన్ లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోన్ లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఏపీ మాజీ సీఎం వై.ఎస్. జగన్ కు మేలు చేకూర్చే ఉద్దేశంతోనే ఫోన్ లు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును సిట్ అధికారులు విచారించగా టీడీపీ ముఖ్య నేతల ఫోన్ లను ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి కొనుగోలు చేసిన ప్రత్యేక పరికరం ద్వారా ఫోన్ లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఫోన్ ట్యాపింగ్ లో కేవలం చంద్రబాబు, లోకేశ్ మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీజేపీలోని ముఖ్య నేతల ఫోన్ లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Phone Tapping Scandal Rocks Andhra Pradesh Naidu and Lokesh s Phones Targeted

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎస్ ఐబీ కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్‌ లు అదృశ్యం కావడం కలకలం రేపింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేయడానికి ప్రభాకర్ రావు, మరో ప్రధాన నిందితుడు డీఎస్పీ ప్రణీత్ రావులను సిట్ అధికారులు కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ కేసులో దాదాపు 600 మంది బాధితుల జాబితాను సిట్‌ సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+