నిన్న లొల్లి..: రేవంత్, ఎర్రబెల్లి కలిసి ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రబెల్లి టీడీపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఇటీవల వినిపించిన విషయం తెలిసిందే. మరో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డితో మెట్రో విషయంలో విభేదించారు. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో ఎర్రబెల్లి కారు ఎక్కుతారనే ప్రచారం సాగింది.
ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిలు కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ను ఏకిపారేశారు.

తెలంగాణ టీడీపీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసమర్థ పాలన కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలు సోమవారం ధ్వజమెత్తారు.

తెలంగాణ టీడీపీ
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందులోనే తాడోపేడో తేల్చుకుందామని వారు సవాల్ చేశారు.

తెలంగాణ టీడీపీ
ఎన్నికల అనంతరం శాసన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రతి అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, మరి అప్పటి నుండి ఇఫ్పటి వరకు ఎందుకు సమావేశం పెట్టలేదని ప్రశ్నించారు.

తెలంగాణ టీడీపీ
అధికారంలోకి రాగానే రైతులకు ఎనిమిది గంటలు విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడేమో మాట మారుస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications