యాదగిరి గుట్టలో కేసీఆర్ బిజీబిజీ (పిక్చర్స్)
నల్గొండ/మెదక్: యాదగిరిగుట్టను నాలుగు అంచెల్లో అతి సుందరంగా అభివృద్ధి చేయాలని, గుట్ట ప్రాంతాన్నంతా పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులను బుధవారం ఆదేశించారు.
గుట్టలో దైవసంబంధ కార్యక్రమాలు తప్ప ఇతర వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఆయన లక్ష్మీ నృసింహస్వామిని బుధవారం దర్శించుకొన్నారు.
గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుట్టపై గల అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గుట్ట అభివృద్ధిపై వారికి సవిస్తారమైన సూచనలు చేశారు.

కేసీఆర్
ప్రభుత్వ భూముల్ని సర్వేచేసి ఖాళీగా ఉన్న రెవెన్యూ భూముల్ని ఆలయం అథారిటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

కేసీఆర్
అవసరమైతే రెవెన్యూ, అటవీ భూముల మధ్యఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలాల్ని సైతం సేకరించాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు.

కేసీఆర్‌కు వేదపండితుల ఆశీర్వాదం
ఏ రూపంలోనైనా సుమారు 600 ఎకరాల భూమిని వెంటనే దేవస్థానానికి స్వాధీనం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఉత్తర్వులు సిద్ధం చేసి రెండు, మూడు రోజుల్లో దేవస్థానానికి అప్పగించాలని స్పష్టం చేశారు.

కేసీఆర్
యాదగిరి గుట్టపై ఉన్న అస్తవ్యస్థ కట్టడాల్ని తొలగించాలని, గుట్టచుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్
యాదగిరి గుట్టపై అతిపెద్ద ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని నిర్ధారించాలని, గరుత్మంతుడి విగ్రహం వద్ద ప్లాట్‌ఫాం నిర్మించాలన్నారు.

కేసీఆర్
అందరికీ కనిపించేలా గోపుర నిర్మాణం జరగాలని ముఖ్యమమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ పనులన్నీ నాలుగు అంచెల్లో పూర్తి కావాలని తెలిపారు.












Click it and Unblock the Notifications