వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజీవయ్య పార్క్‌లో వరల్డ్‌లో ఎత్తైన టవర్‌కి కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉప సంఘాన్ని దీని కోసం ఏర్పాటు చేశారు.

పర్యావరణ పరిమితులు, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడే హుస్సేన్ సాగర్ చుట్టూ మొదటి దశలో 40 ప్రదేశాల్లో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఆకాశ హర్మ్యాలు (స్కై స్క్రాపర్స్) నిర్మించాలని నిర్ణయించారు.

సచివాలయంలో సీఎం కేసీఆర్ సాగర్ ప్రక్షాళన, 40 టవర్ల నిర్మాణంపై ఐదు గంటలపాటు సమీక్ష జరిపి, టవర్లు నిర్మించే ప్రాంతాలను గుర్తించారు. సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

సంజీవయ్య పార్క్ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. టవర్స్ వల్ల వచ్చే మురికి నీరు సాగర్‌లోకి రాకుండా నేరుగా నాలాలోకి వెళ్లే విధంగా భూగర్భ డ్రైనేజి ఏర్పాటు ఉండాలని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

పెద్ద ఎత్తున టవర్లు నిర్మిస్తున్నందున దానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలోనూ మొదటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకు పోవాలని కేసీఆర్ అధికారులకు తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

టవర్ల నిర్మాణానికి చాలా సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

అటు సాగర్‌కు పూర్వ వైభవం తేవడం, ఇటు హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి టవర్ల నిర్మాణం జరగాలన్నారు. రెండింటిలోనూ పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని అధికారులను కోరారు.

English summary
Subject of KCR, CM of Telangana Review with Officials on Hussainsagar at Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X