హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేక్ గ్యాంగ్‌ కోరలు పీకిన పోలీసులు: కలిసి వచ్చిన సాక్షి నెం. 21 (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ వస్తున్న స్నేక్ గ్యాంగ్ కోరలు పీకి, వారికి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించారనే మాట వినిపిస్తోంది. వారి సమర్థత కారణంగానే స్నేక్ గ్యాంగ్‌కు యావజ్జీవంసైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసిన స్నేక్ గ్యాంగ్ అరాచకాలు కేసులో నిందితులకు యావజ్జీవం పడింది.

స్నేక్ గ్యాంగ్‌కు శిక్ష వేస్తూ వెలువడిన తీర్పు మహిళల జోలికి వెళ్లే కీచకకలకు హెచ్చరికగా మారిందనే మాట వినిపిస్తోంది. ఈ తీర్పుతో ప్రజలకు సైబరాబాద్ పోలీసులపై విశ్వాసం పెంచిందని అంటున్నారు. 2014 జూలైలో వెలుగులోకి వచ్చిన స్నేక్ గ్యాంగ్ ఉదంతం వెలుగు చూసింది.

అందులో ఈ గ్యాంగ్ సభ్యులు పాములతో బెదిరించి యువతులతో వికృత చేష్టలకు పాల్పడిన వీడియోలు చూసినవారికి ఒళ్ల జలదరించింది. స్నేక్ గ్యాంగ్ అంటేనే ప్రజల్లో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే, పోలీసులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్సించకపోవడమే కాకుండా ఒత్తిళ్లకు కూడా తలొగ్గకపోవడం గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ఛేదించిన అత్యంత కీలకమైన కేసుల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుంది.

నిందితులకు శిక్ష పడడంతో వారి తరఫు బంధువులు బుధవారం కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగలేదంటూ విమర్శించారు.

ఇలా జరిగింది...

ఇలా జరిగింది...

హైదరాబాద్ పహాడిషరీఫ్ షాహిన్‌నగర్‌లోని ఓ ఫాంహౌజ్‌లో ఓ కుటుంబం విహార విడిదికి వచ్చింది. వారంతా సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోయారు. త్వరలోనే వివాహం చేసుకోబోయే ఓ జంట మాత్రం ఒంటరిగా ఆ ఫాం హౌజ్‌లో ఉండిపోయారు.

విషయం తెలుసుకున్న స్నేక్ గ్యాంగ్..

విషయం తెలుసుకున్న స్నేక్ గ్యాంగ్..

ఈ విషయం తెలుసుకున్న స్నేక్ గ్యాంగ్ లీడర్ ఫైసల్ దయానీ అతని అనుచరులు ఖాదర్, ఖాజా, సయ్యద్ అన్వర్, తయ్యబ్, పర్వేజ్, ఇబ్రహీంలు ఫాంహౌస్‌లోకి బలవంతంగా ప్రవేశించి జంట ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ యువతిని వివస్త్రను చేసి వీడియోలు తీసి అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి డబ్బులు, బంగారం ఆభరణాలను దోచుకున్నారు.

పోలీసుల చొరవనే...

పోలీసుల చొరవనే...

ఈ సంఘటనతో తీవ్రంగా వణికిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడానికి భయపడిపోయింది. సంఘటన విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మొదట బాధితురాలిలో తన వివరాలు ఎక్కడ బయటికి రాకుండా చూసుకుంటామనే నమ్మకాన్ని కలిగించారు. ఆ తర్వాత వారి బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని స్నేక్ గ్యాంగ్ గుట్టును బయటపెట్టారు.

దర్యాప్తు వేగవంతం...

దర్యాప్తు వేగవంతం...

గ్యాంగ్ రేప్ కేసులో కూడా సైబరాబాద్ పోలీసులు ఘటన జరిగినప్పటి నుంచి దర్యాప్తును వేగవంతంగా జరిపారు. ఈ కేసులో పాత్ర ఉన్న 9 మందిని గుర్తించి వారందరినీ 15 రోజుల్లోనే అరెస్టు చేసి జైలుకు పంపారు.

బెయిల్ రాకుండా...

బెయిల్ రాకుండా...

నిందితులకు బెయిల్ దక్కకుండా నిర్ణీత గుడువులో ఛార్జీషీటును దాఖలు చేయడంతోపాటు కోర్టు విచారణను ప్రారంభించి స్నేక్ గ్యాంగ్ నిందితులకు యావజ్జీవం శిక్ష పడేలా సక్సెస్ అయ్యారు.

ఆధారాలు వదలలేదు...

ఆధారాలు వదలలేదు...

స్నేక్ గ్యాంగ్ పట్ల నెలకొన్న భయాన్ని తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రతి ఆధారాన్ని భద్ర పర్చుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో మెటీరియల్ ఎవిడియన్స్‌ను సమగ్రవంతంగా సేకరించారు.

బాధితులకు రక్షణ...

బాధితులకు రక్షణ...

స్నేక్ గ్యాంగ్ బారిన పడ్డ బాధితులకు రక్షణ కల్పించి వారిలో భరోసా కలిగించి, వారి నుంచి వాంగ్మూలాలను రాబట్టి దుండగుల చేసిన ఆఘాత్యాలకు పూర్తి సాక్ష్యాలను సంపాదించారు.

డిలిట్ సమాచారాన్నీ రాబట్టారు...

డిలిట్ సమాచారాన్నీ రాబట్టారు...

దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్‌లో డిలీట్ అయిన సమాచారాన్ని రాబట్టి వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను త్వరితగతిన సంపాదించి కోర్టు ముందు పెట్టడంతో సాక్షాలు బలపడ్డాయి.

బాధితురాలి ఆచూకీ బయటపడకుండా..

బాధితురాలి ఆచూకీ బయటపడకుండా..

ఈ కేసులో కూడా ఎక్కడా బాధితురాలి ఆచూకీ బయటపడకుండా అత్యంత గోప్యత పాటించడంతో మహిళల్లో సైబరాబాద్ పోలీసులపై మరింత గౌరవం పెరిగింది.

కలిసి వచ్చిన సాక్షి నెంబరు 21..

కలిసి వచ్చిన సాక్షి నెంబరు 21..

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్నేక్ గ్యాంగ్ కేసులలో సాక్షుల సంఖ్య 21 సైబరాబాద్ పోలీసులకు కలిసొచ్చింది. అభయ కేసులోనూ అదే కలిసి వచ్చింది. ఇది యాదృచ్చికమైనప్పటికీ ఈ రెండు కేసులలో సాక్ష్యుల సంఖ్య 21గా నమోదైంది.

21 మంది సాక్షులు

21 మంది సాక్షులు

స్నేక్ గ్యాంగ్ కేసులో 21 మంది సాక్షులను ప్రవేశపెట్టార. స్నేక్ గ్యాంగ్ కేసులో ఏడుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది.

మహిళలకు పూర్తి భద్రత

మహిళలకు పూర్తి భద్రత

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నామని, వారి రక్షణ కోసం పంచ సూత్రాలను పాటిస్తున్నమని కమినర్ సివి ఆనంద్ చెప్పారు

కోర్టు వద్ద ఆందోళన...

కోర్టు వద్ద ఆందోళన...

నిందితులకు శిక్ష పడడాన్ని వ్యతిరేకిస్తూ వారి బంధువులు కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరగలేదని నినదించారు.

కమిషనర్‌ను ఘెరావ్ చేశారు...

కమిషనర్‌ను ఘెరావ్ చేశారు...

నిందితుల బంధువు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్‌ను ఘెరావ్ చేశారు కూడా... తమకు న్యాయం కావాలంటూ నినదించారు.

English summary
Cyberabad police promptly acted in Snake Gang case. Pahaidee Shareef police in Hyderabad busted the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X