Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇలా సంభాషణ: ఆంధ్ర గ్యాంగ్‌తో కలిసి అభయ్ కిడ్నాప్, హత్య (పిక్చర్స్)

హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని టూ వీలర్‌పై కిడ్నాప్ చేసిన దుండగులు ఆ తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది. అభయ్‌ని కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్ అతని తండ్రితో ఫోన్‌లో మాట్లాడాడు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోలోని సంభాషణ హిందీలో జరిగింది. అయితే, అభయ్‌ని కిడ్నాపర్లు హత్య చేసి, శవాన్ని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాదు రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లారు.

అభయ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిగా పోలీసులు సాయిగా గుర్తించారు. రాజమండ్రికి చెందిన ముఠా సాయంతో ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని అతను నడిపినట్లు నిర్ధారించారు.

అభయ్ తండ్రి: హలో హలో.. ఎవరు మాట్లాడుతున్నారు అన్నా...
కిడ్నాపర్: కిడ్నాపర్‌ను మాట్లాడుతున్నా...మీకు చెప్పాను కదా డబ్బు కావాలని..
అభయ్ తండ్రి: ఎంత అడిగారు
కిడ్నాపర్: పది కోట్లు.. పది కోట్లు
అభయ్ తండ్రి: అంత ఇవ్వలేం
కిడ్నాపర్: ఎంత ఇస్తారు
అభయ్ తండ్రి: ఇంట్లో ఐదు లక్షల నగదు, కొద్దిగా బంగారం ఉంది అది ఇచ్చేస్తాను
కిడ్నాపర్: అబద్ధాలు చెప్పొద్దు
అభయ్ తండ్రి: నేను అబద్ధాలు ఎందుకు చెప్పుతాను. నా దగ్గర ఉన్నది చెప్పుతున్నాను
కిడ్నాపర్: లాస్ట్‌కు ఎంత ఇస్తావు
అభయ్ తండ్రి: ఇంట్లో అంతా వెతికినా 7,8 లక్షల రూపాయలు, 10, 20 తులాల బంగారం కన్నా ఎక్కువ దొరకదు. ఉన్నదంతా ఇచ్చేస్తా
కిడ్నాపర్: చూడు నేను మీ అబ్బాయిని ఎంతో మంచిగా చూసుకుంటున్నాను.. రేపు అడుగు.
అభయ్ తండ్రి: నీ కాళ్ళు పట్టుకుంటా, నీ చేతులు పట్టుకుని దండం పెడతా. నీవు అడిగినంత డబ్బు నా దగ్గర లేదు
కిడ్నాపర్: లాస్ట్ అండ్ ఫైనల్.. ఐదు కోట్లు
అభయ్ తండ్రి: నేను నాంపల్లి వరకు వచ్చినా..నిన్ను కలవాలంటే ఎక్కడికి రావాలి.
కిడ్నాపర్: ఐదు కోట్లు ఇవ్వాలి. మీ వాడిని అడుగు నేను ఎంత మంచిగా చూసుకున్నాను
అభయ్ తండ్రి: ఎక్కడ కలవాలి
కిడ్నాపర్: సికింద్రాబాద్‌కు రావాలి (ఫోన్ కట్)..

పదికోట్లు డిమాండ్ చేసిన నిందితులు

అభయ్‌ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు బుధవారం రాత్రి 10.05 గంటల సమయంలో 7842276480 నంబర్ నుంచి తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. పది నిమిషాల్లో పది కోట్ల రూపాయలు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం ఐదు కోట్లు ఇస్తే మీ అబ్బాయి గురువారం ఉదయం ఆరు గంటలకు ఇంటికి తిరిగి వస్తాడు అని ఓ కిడ్నాపర్ బేరానికి దిగాడు. చివరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రావాలని ఫోన్ పెట్టేశాడు. ఈ క్రమంలో డబ్బులు డిమాండ్ చేశారన్న విషయాన్ని, సెల్‌ఫోన్ నంబర్‌ను రాజ్‌కుమార్ పోలీసులకు అందించారు.

ఆ ఫోన్‌కాల్ సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రాత్రి 11గంటల ప్రాంతంలో కిడ్నాపర్ మరోసారి ఫోన్ చేసి డబ్బు ఏమైందని ప్రశ్నించాడు. అయితే ఈసారి టవర్ లొకేషన్ నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతంలో చూపించిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వాహనంపై వచ్చి అట్టపెట్టెను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఆల్ఫా హోటల్ ప్రాంతంలో వదిలివెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టమైంది.

మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ నుంచి హోండా యాక్టివాపై బయలుదేరి దారుస్సలాం ప్రాంతంలో కిడ్నాపర్లు దానిని వదిలేసి కారులో అభయ్‌ను తీసుకువెళ్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు పది బృందాలను రంగంలోకి దింపామని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ హత్యకేసులో ముగ్గురు నిందితులను విజయవాడలో టాస్క్‌ఫోర్స్ బృందాలు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మొత్తం కిడ్నాప్, హత్యలో ఐదుగురి హస్తం ఉండి ఉంటుందని టాస్క్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు.

అభయ్ హంతకులను పట్టిస్తే లక్ష బహుమతి: హైదరాబాద్ సీపీ

అభయ్ కిడ్నాప్, హత్యకేసులో నిందితుల ఆచూకీకి సంబంధించిన సమాచారం అందిస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అభయ్‌ను ద్విచక్రవాహనం మీద తీసుకువెళ్తున్న యువకుడిని ఎవరైనా గుర్తుపట్టినా, అతని గురించి తెలిసినా వెంటనే వెస్ట్‌జోన్ డీసీపీ (9490616552)కు లేదా హైదరాబాద్ వాట్సప్(9490616555) సమాచారం అందించాలని సీపీ తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పారు.

నిందితుడిని గుర్తించిన పోలీసులు

అభయ్ కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించారు. తండ్రి దుకాణంలో పని చేసే వ్యక్తే నిందితుడు అని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అతను అభయ్ ఇంటి పక్కనే అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఆంధ్రా నుంచి గ్యాంగును తీసుకు వచ్చి కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఇంటి పక్కన ఉండే సాయిగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన ముఠా సాయంతో అభయ్‌ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

కొంతకాలంగా అభయ్‌తో స్నేహంగా మెలుగుతున్నాడు. స్నేహం పేరుతో అభయ్‌ని నమ్మించి మోసం చేశాడు. అభయ్ హత్య అనంతరం వారు విజయవాడ పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కొందరు ఏపీకి వెళ్లారు.

సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఎక్కడ ఉన్నాడో పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజులుగా అభయ్ కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టాలని నిందితుడు కుట్ర పన్నాడని పోలీసులు గుర్తించారు.

టిఫిన్ కోసం వెళ్లాడు..

టిఫిన్ కోసం వెళ్లాడు..

ఎప్పటిలానే అభయ్ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో టిఫిన్ తెచ్చుకునేందుకు హోండా యాక్టివాపై ఆగాపురాలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు. అభయ్ ఎంతకు రాకపోవడంతో తల్లి అనురాధ తన తోడు కోడలు కవిత సెల్‌ఫోన్ ద్వారా అభయ్‌కి ఫోన్ చేసి ఇంకా రాలేదేమని అడుగగా మరో ఐదు నిమిషాలలో ఇంటికి చేరుకుంటానని సమాధానం ఇచ్చాడు.

ఇద్దరు పిల్లలు...

ఇద్దరు పిల్లలు...

షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం కాలనీలో నివాసముంటున్న రాజ్‌కుమార్ మోదానీ, అనురాధ దంపతులకు అభయ్(16), అభిషేక్(16) కవలలున్నారు. ఇద్దరు కూడా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. హైదరాబాద్ నగర శివారులోని కాటేదాన్‌లో రాజ్‌కుమార్ ప్లాస్టిక్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు.

తిరిగి ఫోన్ ఇలా..

తిరిగి ఫోన్ ఇలా..

అరగంట గడిచినా అభయ్ ఇంటికి చేరుకోకపోవడంతో తల్లి తిరిగి ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. దాంతో ఆందోళనకు గురైన ఆమె.. భర్త రాజ్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఇంటికి చేరుకొన్న రాజ్‌కుమార్.. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో రాత్రి ఏడున్నరకు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు

మిస్సింగ్ కేసు నమోదు

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అభయ్ కోసం ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో దృశ్యాలను పరిశీలించగా ఓ యువకుడు టూవీలర్‌పై అభయ్‌ను తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు, అభయ్ స్నేహితులు గుర్తు పట్టకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది.

విజయవాడకు పరారీ...

విజయవాడకు పరారీ...

అభయ్‌ని కిడ్నాప్ చేసిన వ్యక్తులు సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఉండి, హత్యానంతరం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ లేదా విజయవాడ పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల అదుపులో ముగ్గురు...

పోలీసుల అదుపులో ముగ్గురు...

వ్యాపార లావాదేవీల్లో అభయ్ తండ్రికి ఇతరులతో ఏవైనా వివాదాలున్నాయా? ఆస్తి తగాదాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అట్టపెట్టెలో శవం..

అట్టపెట్టెలో శవం..

బుధవారం మధ్యాహ్నం కిడ్నాపైన అభయ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అల్ఫా హోటల్ వద్ద రాత్రి ఓ అట్టపెట్టలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు.. కొద్ది సేపట్లోనే అభయ్‌ను ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శవానికి పోస్టుమార్టం

శవానికి పోస్టుమార్టం

అభయ్ మృతదేహానికి గాంధీ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. దాంతో అభయ్ అంత్యక్రియలను గురువారం ఇమ్లిబన్ శ్మశానవాటికలో నిర్వహించారు.

ముక్కులో పేపర్లు కుక్కి...

ముక్కులో పేపర్లు కుక్కి...

ముక్కులో పేపర్లు కుక్కి ఊపిరాడకుండా చేసి కిడ్నాపర్లు అభయ్‌ని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థి అభయ్ మోదానీ కిడ్నాప్, హత్య కేసును ఛేదించేందుకు అన్ని కోణాలలో హైదరాబాద్ నగర పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

పక్కా ప్లాన్ ప్రకారం..

పక్కా ప్లాన్ ప్రకారం..

పక్కాప్లాన్ ప్రకారం అభయ్‌ను తీసుకెళ్లి.. డబ్బుల కోసం కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడి కిడ్నాపర్లు హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+