వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: కన్నయ్యపైకి షూ, పోలీసుల అదుపులో ఇద్దరు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారంనాడు ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి ఆయనపైకి బూటు విసిరాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

తోపులాట, అరుపులు, కేకలతో ఆ ప్రదేశం దద్ధరిల్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన గో రక్షా దళ్ కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అక్కడే ఉన్న ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సభలో ప్రసంగించేందుకు కన్నయ్య వచ్చారు.

ఇదిలావుంటే, కన్నయ్య వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. కన్నయ్య వాహనంతో పాటు పోలీస్ కార్లు రెండు, ప్రెస్ కారు ఒకటి వెళుతుండగా అవి ఒకదానికొకటి రాసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కన్నయ్య ఎటువంటి గాయలు కాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి.

కన్నయ్యపైకి విసిరిన బూటు

కన్నయ్యపైకి విసిరిన బూటు

హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రసంగిస్తుండగా కన్నయ్య కుమార్‌పైకి ఓ వ్యక్తి షూ విసిరాడు. ఆ షూ ఇక్కడ ఇలా పడింది.

మరో షూ...

మరో షూ...

సుందరయ్య విజ్ఝాన కేంద్రంలో కన్నయ్య కుమార్ మీదికి వ్యక్తి రెండు షూలు విసిరినట్లు అర్థమవుతోంది. మరో షూ ఇలా పడి ఉంది.

పోలీసుల అదుపులో...

పోలీసుల అదుపులో...

సుందరయ్య విజ్ఝాన కేంద్రంలో కన్నయ్య కుమార్ మీదికి బూటు విసిరిన వ్యక్తిని పోలీసులు గురువారంనాడు అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర గందరగోళం...

తీవ్ర గందరగోళం...

హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్నయ్య కుమార్ ప్రసంగిస్తుండగా గోసంరక్షా దళ్ కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది.

వాగ్వివాదం...

వాగ్వివాదం...

కన్నయ్య కుమార్ ప్రసంగించడానికి వచ్చినప్పుడు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎబివిపి, ఎఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదు, తోపులాట చోటు చేసుకుంది.

ఇద్దరిపై కేసు నమోదు...

ఇద్దరిపై కేసు నమోదు...

కన్నయ్య కుమార్ ప్రసంగిస్తుండగా జరిగిన సంఘటనలకు సంబంధించి పోలీసులు నరేష్, పవన్ కుమార్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మమ్మల్ని భయపెట్టలేరు...

మమ్మల్ని భయపెట్టలేరు...

తను బెదిరింపులతో భయపెట్టలేరని కన్నయ్య కుమార్ ఘర్షణ సంఘటనను ఉద్దేశించి అన్నారు. ఘర్షణకు దిగడానికి వచ్చినవారిని ఏమీ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏమైనా చేసుకోండి...

ఏమైనా చేసుకోండి...

మీరేం చేయదలుచుకున్నారో అది చేయండి, నేను భయపడను, నేను గాంధేయ మార్గంలో పయనిస్తాను అని కన్నయ్య కుమార్ అన్నారు.

English summary
A show was hurled at Kanhaiya Kumar on Thursday when he was addressing a gathering of students here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X