Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ సీఎం అభ్యర్ది ఆయనే - ప్రధాని మోదీ సంకేతాలు..!?

ప్రధానిమోదీ హైదరాబాద్ పర్యటన వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎల్బీ స్టేడియం లో జరిగిన సభలో ప్రధాని మోదీ బీజేపీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం..కాంగ్రెస్ పైన విమర్శలు చేసారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాలకు నాడు వాజ్ పేయ్ హాయం నుంచి నేటి వరకు ఎలాంటి నియామకాలు జరిగాయో చెప్పుకొచ్చారు. ఆ తరువాత 33 సంఘాలతో సమావేశమైన ప్రధాని కీలక సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రధాని మోదీ పర్యటనతో:తెలంగాణలో బీసీ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. నాడు అమిత్ షా సూర్యాపేట సభలో బీసీ సీఎం నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయాన్ని ఎన్నికల నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. పార్టీ విధానం స్పష్టం చేసారు. కేసీఆర్ కుటుంబం పైన విరుచుకుపడ్డారు. బీసీల ఆత్మ గౌరవ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలతో..బీసీలకు తెలంగాణలో ఇచ్చే ప్రాధాన్యత పైన హామీ ఇచ్చారు. ఆ తరువాత ప్రధాని మోదీ33 బీసీ, కుల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ నేతల్లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్ది ఎవరో ప్రధాని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పార్టీ నేతల మధ్య చర్చ సాగుతోంది.

PM Modi hints Telangana BJP CM CAndidate in meeting with BC Community leadrs as Reports

బీజేపీ సీఎం -సంకేతాలు:ప్రధాని వారితో సమావేశమైన సమయంలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్దులను, బీసీలను గెలిపించుకోండి. అందరికీ అందుబాటులో ఉండే ఈటల రాజేందరే మీ నాయకుడు అని ప్రధాని పేర్కొన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలు వేర్వేరుగా సమావేశమైన సమయంలోనూ ఢిల్లీ అగ్ర నాయకత్వం నుంచి ఇదే రకమైన సంకేతాలు వచ్చినట్లు చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో బీసీ వర్గాలంతా కలిసి బీజేపీని గెలిపిస్తే పాలనా పరంగా అనుభవం ఉన్న ఈటలను ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనలో ఉందనేది తెలంగాణ బీజేపీ నేతల అభిప్రాయం. తాజాగా ప్రధాని హైదరాబాద్ సభలోనూ ఈటలకు ఇచ్చిన ప్రాధాన్యతను పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

బీజేపీలో కీలక చర్చ:ప్రధాని సభలో మరో వైపు కూర్చున్న ఈటల రాజేందర్ ను పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు..బీజేపీ అభ్యర్దుల ఖరారు..ఎన్నికల సన్నద్దత పైన ఆరా తీసారు. పార్టీ బీసీ నినాదానికి ప్రజల్లో వస్తున్న స్పందన పైన మోదీ అడిగినట్లు సమాచారం. గజ్వేల్ లో తన నామినేషన్ సమయంలో 20 వేల మంది వరకు వచ్చారని..ప్రజల్లో మంచి స్పందన ఉందని ఈటల ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు సభాస్థలికి ఓపెన్ టాప్ జీప్ లో వచ్చినప్పుడు వెనుక ఉన్న ఈటలను మోదీ ముందుకు పిలిపించుకుని తన పక్కనే నిలబెట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ప్రధాని పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ బీజేపీలో కీలక చర్చకు దారి తీస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+