ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ రెండవ వారంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పర్యటనతో పాటు, ప్రధాని మోదీని తెలంగాణ రాష్ట్రానికి రప్పించడానికి రాష్ట్ర బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో భారీ సభను నిర్వహించడానికి కూడా ప్రణాళికలను రచిస్తోంది.
ప్రధాని పర్యటన.. బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి ప్రత్యేక భేటీ
ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలను టార్గెట్ చేసి మోదీ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులలోనూ, ప్రజలలోను బలమైన సంకేతాలను పంపనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలం, ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉంది.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వంటి అంశాల పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోసం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న సభతో పార్టీకి దిశా నిర్దేశం చేయాలని, వారిని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చూడాలని బిజెపి యోచిస్తోంది. ప్రధాని మోదీ పర్యటన పైన రాష్ట్ర నాయకులు స్థానిక నేతలకు ఇప్పటికే సంకేతం ఇచ్చారు.
ప్రధాని పర్యటనను అజెండాగా తీసుకొని బీజేపీ శ్రేణులతో సమావేశం
దీంతో కిషన్ రెడ్డి జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు, ప్రధాని పర్యటనను అజెండాగా తీసుకొని బీజేపీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సత్తా చాటాలని, మళ్ళీ బలోపేతం కావాలని ఆలోచిస్తున్న బిజెపి కి ప్రధాని మోదీ పర్యటన ఒక బిగ్ బూస్ట్ ఇస్తుందన్న చర్చ జరుగుతోంది.
మోడీ టూర్ నేపథ్యంలో మరింత జోష్
గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి ఓటు షేర్ చాలా పెరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో బిజెపి గతం కంటే మెరుగుపడింది. ఇక రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న బిజెపి శ్రేణులు మోడీ టూర్ నేపథ్యంలో మరింత జోష్ తో ముందుకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
-
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం












Click it and Unblock the Notifications