ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. విశేషాలేంటి?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' 120వ ఎపిసోడ్ ఇవాళ ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇందులో తెలంగాణలోని ఆదిలాబాద్ ఆదివాసీ మహిళల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డుల గురించి వివరించారు. ఇప్పపువ్వు లడ్డూల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ఆదివాసీ మహిళల స్వయం కృషిని మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇప్పపువ్వు లడ్డూను ఎలా తయారు చేస్తారు..?
'ఆదివాసీ ఆహారం' పేరుతో ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూ తయారీ కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్‌లో నడుపుతున్నారు. భీం బాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం అధ్వర్యంలో ఈ కేంద్రాన్ని 12 మంది మహిళలు కలిసి ప్రారంభించారు. ఈ సంఘానికి లీడర్‌గా కుమ్ర భాగుబాయి ఉన్నారు. ఇప్ప పువ్వు ఏటా వేసవిలో బాగా లభ్యం అవుతుంది. వేకువ జామునే ఆదివాసీ మహిళలు అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వు సేకరిస్తారు. ఆ పూలను తీసుకొచ్చి ఎండలో ఆరబెడతారు.వీటితో లడ్డూలతో పాటు రక రకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు.
मध्य प्रदेश का छिंदवाड़ा हो, तेलंगाना का आदिलाबाद या फिर गुजरात का एकता नगर, यहां फूलों को लेकर हो रहे अनूठे प्रयोग में कुछ नया करने की अद्भुत प्रेरणा है! #MannKiBaat pic.twitter.com/fIwITh7jor
— Narendra Modi (@narendramodi) March 30, 2025
లడ్డూలు ఎలా చేస్తారు..?
ఇప్ప పూలను ఆరబెట్టిన తర్వాత నూనెలో వేయిస్తారు. అనంతరం వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తటి పొడి చేస్తారు. ఇప్పపువ్వు పొడిలో వేరుశనగ పల్లిలు, యాలకులు, బాదం, కాజులను కలుపుతారు. అనంతరం ఆ మిశ్రమాన్ని బెల్లం పానకంలో కలిపి లడ్డూలు తయారు చేస్తారు.ఈ లడ్డూలను బాక్సులలో పెట్టి విక్రయిస్తారు. రూ.400కు కిలో లడ్డులను అమ్ముతారు. వీటిని తింటే శరీరంలో రక్తం వృద్ది చెందుతుంది. మహిళలు రక్త హీనత సమస్యను అధిగమించవచ్చు.












Click it and Unblock the Notifications