జులై3న పీఎం మోడీ బహిరంగసభ.. రాష్ట్రప్రజలకు ఆహ్వాన పత్రికలు పంచాలని బీజేపీ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సక్సెస్ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. జులై 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీగా తరలివచ్చేలా తెలంగాణ బీజేపీ యూనిట్ కసరత్తు చేస్తోంది.

మోడీ సభకు జనసమీకరణకు ఆహ్వాన పత్రికలు పంచాలని నిర్ణయం
జూలై 3న హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రికార్డు స్థాయిలో 10 లక్షల మందిని సమీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఆహ్వానపత్రికలను పంపిణీ చేయాలని తెలంగాణ బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. 50 లక్షలు ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసి పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేసి, ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు వచ్చేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు.

నియోజకవర్గానికి 10వేల మంది తగ్గకుండా బహిరంగ సభకు జనసమీకరణ
ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది చొప్పున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పది వేలకు తగ్గకుండా ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయస్థాయి అగ్రనేతలు అందరూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరవుతున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి నిర్ణయించింది. ఆదివారం నాడు బిజెపి కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సమావేశాలు సన్నాహక కమిటీ చైర్మన్ డాక్టర్ కే లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్చార్జ్ అరవింద్ మీనన్ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు కార్యాచరణ .. సక్సెస్ చెయ్యాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం
నియోజకవర్గ ఇన్‌చార్జులు జూన్ 22లోగా ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని, స్థానిక నేతలతో చర్చించి జన సమీకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెండు సమావేశాల విజయవంతానికి విరాళాలు బూత్, మండల, జిల్లా స్థాయిల్లో డిజిటల్ చెల్లింపుల రూపంలో మాత్రమే తీసుకోవాలని, నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరాదని తెలిపారు. హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంలో జాతీయ నాయకత్వం తెలంగాణ యూనిట్‌పై అపారమైన విశ్వాసం చూపిందని, అంచనాలకు అనుగుణంగా సమావేశాలను సక్సెస్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నాయకుల పై ఉందని వారు భావిస్తున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు
టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో రాజకీయ పరిస్థితులు కూడా పార్టీకి అనుకూలంగా మారాయని అభిప్రాయపడుతున్నారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ఆ దిశలోనే పార్టీ ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, సీనియర్ నేత పి.మురళీధర్ రావు, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, డి.ప్రదీప్ కుమార్, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం!










Click it and Unblock the Notifications