వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ - నియోజకవర్గం ఫిక్స్..!?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమవుతున్నారు. 2024 ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని ప్రధాని డిసైడ్ అయ్యారని సమాచారం. అందులో భాగంగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాల పైన సర్వేలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఖరారు చేసారు.

ప్రధాని మోదీ స్వయంగా తెలంగాణ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలగా హైజాక్ చేయవచ్చని బీజేపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధాని పోటీ చేసే నియోజకవర్గం పైన తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది.

దక్షిణాది - తెలంగాణ నుంచి ప్రధాని పోటీ..!

దక్షిణాది - తెలంగాణ నుంచి ప్రధాని పోటీ..!

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. అదే సమయంలో ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ఫోకస్ చేసింది. ఈ ఏడాది దక్షిణాదిలో కర్ణాటక..తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగా ప్రధాని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పటం ద్వారా పాజిటివ్ వేవ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ లో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తరువాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేసే అంశం పైన అధికారికంగా ప్రకటనకు బీజేపీ సిద్దం అవుతోంది. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఖచ్చితంగా సానుకూలత పెరుగుతోందని అంచనా వేస్తోంది.

రెండు స్థానాల పై కసరత్తు - అదే నినాదం

రెండు స్థానాల పై కసరత్తు - అదే నినాదం

ప్రధాని మోదీ దక్షిణాదిన తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ఇప్పటి వరకు ప్రచారం సాగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాల పైన కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో అతి పెద్ది లోక్ సభ నియోజకవర్గం.. మినీ ఇండియాగా చెప్పుకొనే మల్కాజ్ గిరి ఒకటి. రెండోది వెనుకబడిన మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం.

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి చెప్పుకొనే స్థాయిలో ఆదరణ ఉంది. సికింద్రాబాద్ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయటం ద్వారా దాదాపుగా నగరంతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయటం ద్వారా ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ అనుకూలత తగ్గి..బీజేపీకి లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచే ఎంపీగా గెలుపొందారు. జైపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇప్పుడు ప్రధాని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.

బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు...

బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు...

ప్రధాని మోదీ తెలంగాణ పైన పూర్తిగా ఫోకస్ చేసారని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రధాని పోటీ పైన తుది నిర్ణయం జరగకపోయినా..ఆ దిశగా ఆలోచనలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అయితే, ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆ సమయంలోనే ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయితే, అసెంబ్లీ ఎన్నికల్లోనే అద అనుకూలంగా మారుతుందని లెక్కలు వేస్తున్నారు. వారణాశి నుంచి ఎంపీగా ఉన్న ప్రధాని అక్కడ ఏ విధంగా డెవలప్ చేసారో అదే మంత్రం ఇక్కడ ప్రచారం చేస్తే వర్కవుట్ అవుతుందని చెబుతున్నారు. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేసే అంశం పైన బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని పోటీ ఖాయమైతే వచ్చే అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది.

English summary
News Roaming that PM Modi likely to contest from Mahabbobnager Loksabha for nect coming Elections, now it became big debate in state politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X