కేసీఆర్ పిలుపు, తొలిసారి తెలంగాణకు మోడీ.. ఇదీ పర్యటన: బీజేపీ ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారయింది. ఆగస్టు 7వ తదీన మిషన్ భగీరథ ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆయన రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయనను మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దీనికి ప్రధాని మోడీ అంగీకరించారు. ప్రధాని పర్యటనపై ప్రాథమిక సమాచారాన్ని పీఎంవో శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మెదక్, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లోని కార్యక్రమాలకు హాజరవనున్నారు.

ఆగస్టు 7న మిషన్ భగీరథను గజ్వెల్ నియోజకవర్గంలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఆ రోజే కేసీఆర్ నిర్వహించే సుదర్శన యాగంలో పాల్గొంటారు. వరంగల్ జిల్లాలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అలాగే, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించనున్న విద్యుత్ ప్లాంటుకు (మొదటి దశ) శంకుస్థాపన చేస్తారు.

కేసీఆర్ పిలుపు, మోడీ రాక

కేసీఆర్ పిలుపు, మోడీ రాక

ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయనను మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దీనికి ప్రధాని మోడీ అంగీకరించారు. ప్రధాని పర్యటనపై ప్రాథమిక సమాచారాన్ని పీఎంవో శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

బీజేపీ నేతలు

బీజేపీ నేతలు

మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ బీజేపీ సమావేశమైంది. ఆయన పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

బీజేపీ నేతలు

బీజేపీ నేతలు

పార్టీ కార్యక్రమాలలోను ప్రధాని మోడీ పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేయాలని రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.

బీజేపీ నేతలు

బీజేపీ నేతలు

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైకోర్టు విభజన, ఎస్సీ వర్గీకరణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ నేతలు

బీజేపీ నేతలు

కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్రం సాయంతోనే తెలంగాణ పథకాలు చేపడుతోందని గుర్తు చేస్తున్నారు.

బీజేపీ నేతలు

బీజేపీ నేతలు

అలాగే, ఈ రెండేళ్లలో తెలంగాణకు బీజేపీ ఇచ్చిన నిధులు, ఇతరాలు, ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi will address the meeting of BJP workers in Hyderabad on August 7.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి