ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా: ‘వందేభారత్’ ఆలస్యం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. జనవరి 19న సికింద్రాబాద్‌లో వందేభారత్ రైలును మోడీ ప్రారంభించాల్సి ఉన్న విషయం తెలిసిందే.

అయితే, ప్రధాని మోడీ షెడ్యూల్‌లో మార్పుల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను తెలియజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

PM Narendra Modi hyderabad tour postponed

కాగా, ప్రధాని మోడీ తన పర్యటనలో ఐదు ప్రాజెక్టులకు భూమి చేయాల్సి ఉంది. మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. సికింద్రబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగసభ కూడా ఉంది. ప్రధాని పర్యటనలో మొత్తం రూ. 7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడంతోపాటు జాతికి అంకితం చేస్తారని ఇంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఇక వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు పొడిగిస్తూ.. దీనికి కూడా ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైతే కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే విశాఖపట్నం చేరుకోవచ్చు. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ. 699 కోట్ల వ్యయంతో రీడెవలప్‌మెంట్ చేయనున్నారు. దీనికి సంబంధింిన పనులకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించనున్నారు. ప్రస్తుతం పర్యటన వాయిదా పడినప్పటికీ.. పర్యటన కొత్త షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మోడీ ఈ అభివృద్ధి పనులన్నింటికీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+