హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెమికల్ కంపెనీలో విషవాయువులు లీక్, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

నగరంలోని బాలానగర్‌ ఇండస్ట్రీ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతంలోని బయోకెమికల్స్‌ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చడం వల్ల మృతి చెందారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని బాలానగర్‌ ఇండస్ట్రీ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక ప్రాంతంలోని బయోకెమికల్స్‌ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు విషవాయువులు పీల్చడం వల్ల మృతి చెందారు.

కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు అందులోకి దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విష వాయువులు వెలువడ్డాయి.

dead-body

దీంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయో కెమికల్స్ కంపెనీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులను మూసాపేట్ జనతానగర్‌కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్(30)గా గుర్తించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Two employees who are working in Bio Chemical Industries situated at Balanagar Industrial Area are died due to poisonous gas leak. The employees while cleaning a drainage in the company premises this incident was happened. One more employee was admited in hospital for treatment. The employees who died are recognized as Alladi Rama rao and Alladi Sitaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X