Nagamani: నాగమణి హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపోల్ లో జరిగిన మహిళా కానిస్టేబుల్‌ నాగమణి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు పరమేశ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా నిందితుడికి సహకరించిన వారి కోసం పోలీసులు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రధాన నిందితుడు పరమేశ్ పై పోలీసులు బీఎన్‌ఎస్‌ 103 (1) సెక్షన్‌ కింద కేసు పెట్టారు. ఇబ్రహీంపట్నం రాయపోల్ కు చెందిన నాగమణికి ఒక అక్క, తమ్ముడు ఉన్నాడు. వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు.

దీంతో పెద్దనాన్న సహకారంతో వారు పెరిగి పెద్దయ్యారు. నాగమణికి 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆ తర్వాత ఆమెకు 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలోనే భర్తతో విభేదాల కారణంగా 2022లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ ను ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కులాంతర వివాహం కావడంతో తమ్ముడు, అక్క ఒప్పుకోలేదు. దీంతో నవంబర్ 10న నాగమణి, శ్రీకాంత్ యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు.

Police arrest accused in Ibrahimpatnam Nagamani murder case

అప్పటి నుంచి వారు సిటీలోనే ఉంటున్నారు. నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధురు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం వీక్ ఆఫ్ కావడంతో తన ఇంటికి వెళ్తానని భర్త శ్రీకాంత్ కు చెప్పి శనివారం సాయంత్రం రాయపోల్ కు వెళ్లింది. ఆదివారం అక్కడే ఉండి.. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు రాయపోల్ నుంచి స్కూటీపై బయల్దేరింది. నాగమణి అనుసరిస్తూ తమ్ముడు పరమేశ్ కారులో వచ్చాడు. కారుతో స్కూటీకి డ్యాష్ ఇచ్చాడు.

దీంతో నాగమణి కింద పడిపోయింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి తమ్ముడు తనను కారుతో ఢీకొట్టాడు. చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెబుతున్న క్రమంలోనే పరమేశ్ కత్తితో నాగమణి మెడపై వేటు వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. నిందుతుడు అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. హత్య ఆస్తి గొడవలని చెబుతున్నారు. అయితే ఆస్తి గొడవల హత్య కాదని.. పరువు హత్య అని నాగమణి భర్త శ్రీకాంత్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+