Ganja: చెట్లు పెంచమంటే.. ఇంటి వద్దే గంజాయి మొక్కలను పెంచాడు..
రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ గంజాయ్ వాడకం పెరుగుతుంది. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేయడంతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో గంజాయ్ వాడినవారు, సరఫరా చేసే వారిని వివరాలను సేకరిస్తున్నారు. అధికారులు డ్రగ్స్ నిర్మూలనకు ఎక్సైజ్, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో చోటు గంజాయ్ బయటపడుతోంది.
తాజాదా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఓ వ్యక్తి ఇంటి వెనకాల పూల మొక్కల తరహాలో గంజాయి మొక్కలను సాగు చేశాడు. మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ వీధిలో ఘాటు వాసన వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడాగా ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలు కనిపించాయి. తుంగళ్లపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్ కాలనీలోమహమ్మద్ ఐదర్ ఇంటి వెనకాల 34 గంజాయ్ మొక్కలు సాగు చేశాడు.

పోలీసులు అతన్ని అరెస్ట్ గంజాయ్ మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. హైదర్ ఆ గంజాయిని స్థానికంగా అమ్మేవాడని తెలుస్తోంది. ఈ గంజాయ్ చెట్లు ఒక్కోటి ఆరు అడుగులు ఎత్తు వరకు పెరిగినట్లు తెలుస్తోంది. నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం (NDPS) కింద కేసు నమోదు చేశారు.కాగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
కలహర్‌రెడ్డిని మంగళవారం గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పోలీసులు 5 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే. మత్తుపదార్థాలతో తనకెలాంటి సంబంధాలు లేకపోయినా కేవలం నిందితుల వద్ద తన ఫోన్ నంబరు లభించడం వల్లనే విచారణకు పిలిచారని నిందితుడు కలహర్‌రెడ్డి పేర్కొన్నాడు. గతంలో పబ్‌లు, ఈవెంట్‌లు నిర్వహించానని, ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు.












Click it and Unblock the Notifications