హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాదకర రసాయనాలతో పాల తయారీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పలు ప్రమాదకర రసాయనాలు, పాలపౌడర్ మిశ్రమంతో పాలను తయారు చేస్తున్న ఓ కల్తీ వ్యాపార ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిహెచ్ఎంసి డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి లింబారెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఈ ముఠా వివరాలను మీడియాకు తెలిపారు.

నగరంలోని భోలక్‌పూర్‌కు చెందిన చిట్టబోయిన దామోదర్ యాదవ్(35) సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో ఓ దుకాణాన్ని కిరాయికి తీసుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో కల్తీ పాల వ్యాపారం ప్రారంభించాడు. దుకాణంలో పాలపౌడర్, నీళ్లు, ఇతర రసాయనాలు కలిపి చిక్కని పాలలా తయారు చేస్తాడు. వీటిని ప్యాకింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తుంటాడు. దీనిపై సమాచారమందుకున్న జిహెచ్ఎంసి ఫుట్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దామోదరరావును అరెస్ట్ చేశారు.

అతడి నుంచి 40 ఆక్సిటోసిన్ ఇంజిక్షన్లు(ఒక్కోటి 100ఎంఎల్), 50కిలోల హైడ్రోజన్ పెరాక్సైడ్, 15లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ క్యాన్లు, 12 బ్యాగుల గుడ్‌డే ప్రీమియం స్ప్రే పౌడర్, 28 బ్యాగుల మురళీ ప్రీమియం బ్రైడ్ పౌడర్, నాలుగు బ్యాగుల భారత్ ప్రీమియం బ్రైడ్ మిల్క్ పాకెట్లు, 5లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మీడియా సమావేశంలో టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారి కె బాలాజీరాజు, ప్రవీణ్, టాస్క్ ఫోర్స్ ఎస్సైలు ముత్తుయాదవ్, శ్రవణ్ కుమార్‌లు పాల్గొన్నారు.

నిందితులు పదిలీటర్ల పాలను తయారు చేసేందుకు ఒక కిలో పాలపౌడర్, 9లీటర్ల నీళ్లు, ఒక్క లీటర్ స్వచ్ఛమైన పాలు, 25మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వినియోగిస్తాడు. వీటన్నింటిని కలిపి కల్తీపాలు తయారు చేస్తాడు. ఈ విధంగా లీటర్ పాలు తయారు చేయడానికి రూ. 15 ఖర్చవుతుండగా, మార్కెట్లో రూ. 45చొప్పున విక్రయిస్తూ రోజుకు రూ. 3వేల నుంచి 4వేల వరకు సంపాదిస్తున్నాడు. అంతేగాక ప్రభుత్వం నిషేధించిన ఆక్సిటోసిన్ అనే హానికరమైన ఇంజిక్షన్లను రూ. 40 నుంచి 50లకు విక్రయిస్తూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

రసాయనాలు

రసాయనాలు

పలు ప్రమాదకర రసాయనాలు, పాలపౌడర్ మిశ్రమంతో పాలను తయారు చేస్తున్న ఓ కల్తీ వ్యాపార ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

పాల తయారీకి రసాయనాలు

పాల తయారీకి రసాయనాలు

జిహెచ్ఎంసి డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి లింబారెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఈ ముఠా వివరాలను మీడియాకు తెలిపారు.

అరెస్ట్

అరెస్ట్

నగరంలోని భోలక్‌పూర్‌కు చెందిన చిట్టబోయిన దామోదర్ యాదవ్(35) సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో ఓ దుకాణాన్ని కిరాయికి తీసుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో కల్తీ పాల వ్యాపారం ప్రారంభించాడు.

అరెస్ట్

అరెస్ట్

దుకాణంలో పాలపౌడర్, నీళ్లు, ఇతర రసాయనాలు కలిపి చిక్కని పాలలా తయారు చేస్తాడు. వీటిని ప్యాకింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తుంటాడు. దీనిపై సమాచారమందుకున్న జిహెచ్ఎంసి ఫుట్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దామోదరరావును అరెస్ట్ చేశారు.

English summary
Task Force Police arrested adulterated milk making gang in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X