Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫేక్ వీడియో: బీజేపీ కార్పొరేటర్ సహా నలుగురి అరెస్ట్

హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌​లో రిగ్గింగ్​‌కు పాల్పడ్డారని ఓ ఫేక్​ వీడియోను వైరల్ చేయడంతో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్​ శ్రావణ్​‌ను సైబర్​ క్రైం​ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌​కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా.. హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌ చేసిన కేసులో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొందరు కిడ్నాప్‌ చేసినట్లు ప్రచారం జరిగినా.. గురవారం సాయంత్రానికి సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఎన్నికల సందర్భంగా పాతబస్తీ బహదూర్‌పురలో రిగ్గింగ్‌ జరుగుతోందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే, అది వేరే ప్రాంతంలోని పాత వీడియో అని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Police arrests BJP Corporator Sravan in Fake Rigging Video issue

ఈ వ్యవహారంపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు.. బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌ కుమార్, నాంపల్లికి మహ్మద్‌ బిన్‌ అలీ, చాదర్‌ఘాట్‌కు చెందిన కాశీ, ముషీరాబాద్‌కు చెందిన మితిలేష్‌ వీడియో వైరల్‌ చేస్తున్నట్లు గుర్తించారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లోని వీరిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో వ్యవహరించిన తీరు ఆందోళనకు కారణమైంది. సాయంత్రం 6 గంటల సమయంలో మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌ సమీపంలోని తన కార్యాలయంలో శ్రవణ్‌ ఉండగా కొందరు రెండు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు శ్రవణ్‌తో మాట్లాడి ఆ తర్వాత బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో తొలుత కిడ్నాప్‌ చేసినట్లు ప్రచారం జరిగింది.

దాదాపు 2 గంటల పాటు మల్కాజ్‌గిరిలో దీనిపై గందరగోళం నెలకొంది. బీజేపీ నేతలు కార్యాలయానికి, మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీసినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన రేకెత్తెంచింది. శ్రవణ్‌ కార్యాలయం సమీపంలోని సీసీ పుటేజీలను గమనించగా పోలీసులు మఫ్టీలో వచ్చినట్లు తేలింది. ఈలోపే తన కుమారుడు శ్రవణ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తండ్రి రాంబాబు మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8 గంటలకు శ్రవణ్‌ సహా నలుగురి అరెస్టును సైబర్‌క్రైమ్‌ పోలీసులు ధ్రువీకరించారు. శ్రవణ్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు తీసుకువెళ్లాలనుకుంటే తమతో చెబితే బాగుండేదని, అలా బలవంతంగా తీసుకెళ్లడం ఎంటని శ్రవణ్ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విపక్ష నేతలపై దౌర్జన్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+