చాందినితో తిరిగాడు: నిందితుడి తండ్రి, ఆ ఇద్దరితో హోటల్లో హద్దు మీరి ఉంటుందనే హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chandni Jain Case : అతనే చంపేశాడు? వీడిన చాందిని జైన్ హత్య మిస్టరీ, ఆ ఫుటేజీ కీలకం.| Oneindia Telugu

  హైదరాబాద్: చాందినీని తన కొడుకు హత్య చేశాడని నిందితుడైన బాలుడి తండ్రి అంగీకరించాడని తెలుస్తోంది. సర్‌.. ఈ వీడియోలో ఉన్నది మా వాడేనని, చాందినీతో కలిసి తిరిగేవాడని పోలీసులకు ఆయన చెప్పారు. నిందితుడు నేరాన్ని అంగీకరించకపోవడంతో సిసి ఫుటేజీని పోలీసులు తండ్రికి చూపించారు.

  చాందినీ జైన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

  తన కుమారుడే ఆమెను చంపేశాడని ఆ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయి. సుమారు 100 వరకు సీసీ ఫుటేజీలను జల్లెడపట్టారు. చివరకు కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలో నిందితుడు, చాందినీ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

  చాందిని నన్ను వదల్లేదు, చంపేశా: నిందితుడు, 'ప్లే బాయ్ కావొచ్చు, అమ్మాయిల్ని మార్చేవాడేమో'

  పదో తరగతి నుంచే మెలిగేవారు

  పదో తరగతి నుంచే మెలిగేవారు

  చాందిని జైన్ హత్యలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. చాందిని బాచుపల్లి సిల్వర్‌ఓక్స్‌ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. మదీనాగూడ ప్రగతి ఎన్‌క్లేవ్‌కు చెందిన నిందితుడు ఆమెతోపాటే పదో తరగతి వరకు చదివాడు. ఆ సమయంలో ఇద్దరు సన్నిహితంగా మెలిగేవారు.

  మరో ఇద్దరితో సాన్నిహిత్యం నచ్చలేదు

  మరో ఇద్దరితో సాన్నిహిత్యం నచ్చలేదు

  అనంతరం నిందితుడు ఇంటర్‌లో కొంపల్లిలోని డీఆర్‌ఎస్‌ కళాశాలకు మారినా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. అయితే చాందిని మరో ఇద్దరితో స్నేహంగా మెదులుతుండటం నిందితుడికి నచ్చలేదు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పినా చాందిని అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగేది.

  వదిలించుకోవాలని

  వదిలించుకోవాలని

  చాందిని వైఖరి నచ్చని నిందితుడు ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం తగిన స్థలం కోసం వెతుకుతూ గత ఆగస్టు 9న అమీన్‌పూర్‌ గుట్టల వద్దకు వెళ్లి చూసి వచ్చాడు. ఈ నెల 1-3 మధ్య నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో టర్డ్‌మన్‌ పేరుతో ఐరాస నమూనాపై విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ జరిగింది. నగరానికి చెందిన మరో ఇంటర్‌ విద్యార్థే దీనికి నిర్వాహకుడిగా వ్యవహరించాడు.

  3రోజులు హోటల్లో కలిసి ఉండటంతో హద్దు మీరి ఉంటారని

  3రోజులు హోటల్లో కలిసి ఉండటంతో హద్దు మీరి ఉంటారని

  హైదరాబాద్‌తోపాటు బెంగళూరు నుంచి 52 మంది విద్యార్థులు హాజరయ్యారు. అక్కడ నాగా, సాహిల్‌ అనే విద్యార్థులు చాందినికి పరిచయమయ్యారు. వారితో స్నేహం గురించి చాందిని నిందితుడి వద్ద ప్రస్తావించింది. మూడురోజులపాటు అందరూ కలిసి హోటల్‌లో ఉండటంతో వారు హద్దు మీరి ప్రవర్తించి ఉంటారని చాందినిపై నిందితుడు మరింతగా కక్ష పెంచుకున్నాడు.

  చివరిసారి గంటన్నర సంభాషణ

  చివరిసారి గంటన్నర సంభాషణ

  హత్య జరిగిన రోజైన 9వ తేదీ సాయంత్రం 5.28 నిమిషాలకు మదీనాగూడ నుంచి నిందితుడితో కలిసి చాందిని ఆటోలో బయలుదేరింది. కొంతసేపటికే అమీన్‌పూర్‌ కూడలిలో దిగి నిర్మానుష్యంగా ఉండే గుట్ట ప్రాంతం వైపు వెళ్లారు. అక్కడ చివరిసారిగా గంటన్నర సేపు ఇద్దరి మధ్య సంభాషణ సాగింది.

  పిడిగద్దులు, మెడపై బలంగా కొట్టడంతో

  పిడిగద్దులు, మెడపై బలంగా కొట్టడంతో

  చాందిని ఇతరులతో సన్నిహితంగా ఉంటున్న విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిందితుడు ఆమె మొహంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా తిరిగి పట్టుకొని మెడపై బలంగా కొట్టడం, గొంతు నులమడంతో చాందిని మృతిచెందింది. అనంతరం బండరాయి పైనుంచి కిందకు తోసేసి తాను వచ్చినదారిలో కాకుండా వేరే మార్గంలో అక్కడినుంచి పారిపోయాడు. ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లి సమీపంలోని చెరువులోకి విసిరేశాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cyberabad Police on Wednesday presented the accused, a minor in the murder case of 12 Standard student Chandini Jain before media. Chandini’s putrefied body was found on the boulders of Aminpur on Tuesday morning two days after she disappeared from her Miyapur home. Chandini Jain who left her home on Saturday at 5pm was found dead in a rocky barren place few kilometers away.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి