ఉగ్రవాదులనేందుకే భయం: కిషన్, అవునని నాయిని
హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్లో మృతి చెందింది ఉగ్రవాదులు అని చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.
చనిపోయిన హోంగార్డు కుటుంబానికి కానిస్టేబుళ్ల కుటుంబాలకు అందించే సాయాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేయాలన్నారు. పోలీసుల పైన రాజకీయ ప్రభావం ఉండవద్దని కోరారు.
బీజేపీ బలోపేతంపై మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వ, నమోదు, కొత్త సభ్యుల్ని చేర్పించడం, సభ్యులకు శిక్షణ కార్యక్రమాలకు ఈ ఏడాది ప్రధాన్యమిస్తామని చెప్పారు. పార్టీ వ్యవస్థాపకులు దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మ శతాబ్దిని ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రారంబించి వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 వరకు నిర్వహిస్తామన్నారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి కలిసే బీజేపీ సంపర్క్ అభఇయాన్ కార్యక్రమాన్ని మే 1 నుండి జూలై 31 వరకు చేపడతామన్నారు. భూసేకఱణ చట్టంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు సరికాదని, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. భూసేకరణ చట్టంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
దొంగలు కాదు ఉగ్రవాదులే: నాయిని

నాయిని నర్సింహా రెడ్డి
నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్దయ్య ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. ఎస్సై ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.

నాయిని నర్సింహా రెడ్డి
సోమవారం సాయంత్రం ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి వచ్చిన నాయిని ఎస్సై ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను, మగబిడ్డకు జన్మనిచ్చి అదే ఆసుపత్రిలో ఉన్న సిద్దయ్య భార్య ధరణీషను కూడా హోంమంత్రి పరామర్శించారు.

నాయిని నర్సింహా రెడ్డి
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. సిద్దయ్యకు బీపీ, గుండె కొట్టుకోవటం సవ్యంగానే ఉందన్నారు. 24 గంటలూ కంటికి రెప్పలా ఎస్‌ఐ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎన్‌కౌంటర్ ఘటనలో మొదట దోపిడీ దొంగలుగా భావించినా మధ్యప్రదేశ్ పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు సిమి ఉగ్రవాదులని నిర్ధారించారన్నారు.

నాయిని నర్సింహా రెడ్డి
హైదరాబాద్‌లో సిమి ఉగ్రవాదులు లేరని, బయటి రాష్ట్రాల నుంచి వారు వస్తున్నారన్నారు. పోలీసులకు అధునాతన ఆయుధాలు ఇస్తామన్నారు. సరైన ఆయుధాలు లేకుండా పోలీసులు వెళ్లటంపై ఆయన స్పందిస్తూ ఆదరాబాదరలో కొన్ని జరుగుతుంటాయన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోమని అన్నారు. ఉగ్రవాదులను తాము పట్టుకోగలిగామన్నారు.
సూర్యాపేటలో పోలీసుల పైన కాల్పులు జరిపింది అంతర్రాష్ట్ర దొంగలని తొలుత భావించామని, కానీ వారు ఉగ్రవాదులేనని తెలిసిందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణ పోలీసులు ధైర్యంగా ఎదుర్కొని జానకీపురంలో మట్టుబెట్టింది ఉగ్రవాదులని తెలిశాక గర్వంగా ఉందని చెప్పారు.
కాగా, కాల్పుల ఘటనపై రెండు రోజుల క్రితం నాయిని మాట్లాడుతూ.. వారు సిమి ఉగ్రవాదులు కాదని, దొంగల ముఠా అని చెప్పారు. దీనిపై విమర్శలు వచ్చాయి. సోమవారం నాడు ఆయన ఉగ్రవాదులని తేలిందని చెప్పారు.
ఆయన సోమవారం రాత్రి కామినేని ఆసుపత్రిలో ఎస్సై సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. సిద్ధయ్యకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. తమ పోలీసుల హీరోయిజాన్ని మీడియానే ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసేందుకు తగిన నిధులు సమకూర్చుతామన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications