Deepthi: వీడిన దీప్తి హత్య కేసు మిస్టరీ.. చెల్లి చందనే నిందితురాలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లి చందనే అక్క దీప్తిని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. చందన తన లవర్ తో కలిసి దీప్తిని చంపేసినట్లు తెలిసింది. చందన.. దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీతే చేతులు కట్టి సోఫాలో పడేసి వెళ్లిపోయింది. దీప్తికి ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పరారీలో ఉన్న చందన, ఆమె ప్రియుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది.

చందన ప్రియుడి తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తానే హత్య చేసినట్లు చందన ఒప్పుకున్నట్లు తెలిసింది. చందన హైదరాబాద్ లోని ఓ ప్రేవేట్ కళాశాలలో బీటెక్ చదువుతుండగా.. తన సీనియర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చందన ఈ విషయాన్ని అక్క దీప్తికి చెపింది. అయితే దీప్తి చెల్లి మతాంతర వివాహానికి ఒప్పులేదని తెలిసింది. అందుకే అక్క దీప్తిని హత్య చేసినట్లు సమాచారం. కాగా దీప్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది.

Police have solved the mystery of the case of Deepti of Korutla in Jagityala district

నిందితులను శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని భీమునిదుబ్బకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు పెద్ద కూతురు దీప్తి, చిన్న కుమార్తె చందన, కొడకు సాయి ఉన్నారు. దీప్తి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. చిన్న కూతురు చందన హైదరాబాద్ లో బిటెక్ చేసింది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. కాగా సోమవారం శ్రీనివాస్, మాధవి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

అదే రోజు చందన లవర్ కోరుట్లకు వచ్చాడు. శ్రీనివాస్ రెడ్డి సోమవారం రాత్రి 10 గంటల దీప్తికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చందనకు ఫోన్ చేస్తే స్వీచ్ఛాఫ్ వచ్చింది. మంగళవారం ఉదయం మరోసారి ప్రయత్నించారు. అయినా కలవలేదు. దీంతో పక్కంటి వారిని వెళ్లి చూడాలని కోరారు. పక్కింటి వారు వచ్చి చూడగా.. దీప్తి సోఫాలో చనిపోయి పడి ఉంది. ఈ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు తెలిపారు. మరోవైవు అక్కడికి చేరుకున్న పోలీసులు వంటి ఇంట్లో మద్యం సీసాలు, కూల్ డ్రింక్ సీసాలు, చిప్స్ ప్యాకెట్లు గుర్తించారు.

చందన లేకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీంచారు. వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు పరిశీలించారు. చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ నిజామాబాద్ బస్సు ఎక్కి వెళ్లిపోయినట్లు గుర్తించారు. చందన ఇంట్లో వెళ్లిపోయేటప్పుడు రూ.1 లక్ష నగదుతో పాటు కిలోన్నర బంగారం, పాస్ పోర్టు కూడా తీసుకెళ్లింది. దీంతో ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండడంతో ఆమెపై లుకవుట్ నేటీసులు జారీ చేయాలని పోలీసులు భావించారు. బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టగా.. నిందితులు ఏపీలో పట్టుబడినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+