Shirisha: బీరు సీసా పగలగొట్టి.. కళ్లలో గుచ్చి... శిరీషను హత్య చేసిన బావ అనిల్..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. బావ అనిల్, అతని స్నేహితులు శిరీష్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బావ అనిల్, అతడి స్నేహితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్ కు చెందిన శిరీషకు ఆమె అనిల్ కు గత శనివారం ఫోన్ విషయంలో గొడవ జరిగింది. అనిల్ మొబైల్ ఎక్కువగా వాడుతున్నావంటూ మరదలు శిరీషను మందలించాడు.
శిరీష కూడా తిరిగి అనిల్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో అనిల్ శిరీషపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన శిరీష రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే అనిల్ అప్పటికే తన స్నేహితులతో కలిసి ఫుల్ గా మద్యం సేవించాడు. ఈ సమయంలోనే శిరీష తమ్ముడు బావ అనిల్ కు ఫోన్ చేసి అక్క శిరీష ఇంటి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో అనిల్ తన స్నేహితులతో కలిసి కాడ్లాపూర్ బయల్దేరారు.

వీరు గ్రామ శివారులో ఉన్న మైసమ్మ టెంపుల్ వద్ద శిరీష కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న అనిల్ ఎందుకు బయటకు వచ్చావని ప్రశ్నించాడు. శిరీష కూడా ధీటుగా సమాధానం ఇవ్వడంతో అనిల్ కోపంతో శిరీషను కొట్టాడు. శిరీషను కుంటవైపు ఈడ్చుకెళ్లారు. అనిల్ స్నేహితుడు వెంటన తెచ్చుకున్న బీరు సీసాను పగల గొట్టి శిరీష కళ్లలో పొడిచాడు. శిరీషను వారందరూ కలిసి కుంటలో పడేశాడు. ఆమె మోకాళ్లపై నిల్చున్నారు.
శిరీష చనిపోయిన తర్వాత వారు కుంట నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం శిరీష నీటి కుంటలో శవమై కనిపించింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కాల్ డేటా ఆధారంగా బావ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే అనిల్ పొంతన లేని సమాధానలు చెప్పడంతో పోలీసులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. అస్సలు విషయం బయటకొచ్చింది.












Click it and Unblock the Notifications