అమ్మాయిలతో ముజ్రా పార్టీలో డ్యాన్స్, 8మంది జిహెచ్ఎంసి స్టాఫ్ సస్పెన్షన్

హైదరాబాద్: హైదరాబాదులోని మాదాపూర్ ఖానామెట్ వద్ద ముజ్రా పార్టీ పైన ఎస్ఓటి పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. జల్సాలు చేస్తున్న పది మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఎనిమిది మంది జిహెచ్ఎంసి ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.

ఆ ఉద్యోగులు ఖానామెట్‌లోని ఓ అతిథి గృహంలో జరిగిన ఆ ముజ్రా పార్టీలో అమ్మాయిలతో కలిసి చిందేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. కాగా, పట్టుబడిన జిహెచ్ఎంసి ఉద్యోగులను ఆదివారం నాడు సస్పెండ్ చేశారు.

Police raid on Mujra party, 8 GHMC staff arrested

వెకిలిచేష్టలతో షీ టీమ్స్‌కు చిక్కిన పోకిరీలు

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత వారం 42 మంది ఈవ్ టీజర్స్ షీ టీమ్స్‌కు దొరికిపోయారు. వీరి వివరాలను ఆరా తీయగా అధికంగా 20 ఏళ్ల వయస్సు వారు అధికంగా ఉన్నారు. ఆ తర్వాత 35 ఏళ్ల మధ్య వయస్కులు కూడా తమ నోటి మాటాలతో మహిళలను కించపరుస్తున్నారు.

ఇలా వీరి వెకిలి చేష్టలను పూర్తి ఆధారాలతో పట్టుకున్న షీ టీమ్స్ వీరికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మరికొందరిని రిమాండ్‌కు తరలించారు. 42 మందిలో ఆరుగురిని షీ టీమ్స్ రిమాండ్‌పై జైలుకు పంపించింది. ఈ 42 మంది చేసిన ఈవ్ టీజింగ్‌పై సైబరాబాద్ షీ టీమ్స్ మొత్తం ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయగా మరో 28 పెట్టీ కేసులను నమోదు చేసింది.

వీరందరికీ గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో వారి తల్లిదండ్రలు, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ను నిర్వహించి మహిళను ఇబ్బందులకు గురిచేస్తే ఎలాంటి చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారు? వాటి వల్ల భవిష్యత్తుకు ఏర్పడే ఆటంకాలు, అడ్డంకులను వివరించారు.

ఈ కేసుల వల్ల వారు కోల్పోయే అవకాశాల గురించి షీ టీమ్స్ కౌన్సిలర్లతో కలిసి తెలిపారు. కాగా, పోకిరీలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ అధికంగా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబరుకు రావడంతో వీరందర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ 42 మందిలో ఈ సారి ఐదుగురు ఆటో డ్రైవర్లు, 54 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇతనికి అతని భార్య ముందు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+