తహాసీల్దార్‌‌లకు భద్రతగా పోలీసులు...!

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళలనకు ప్రభుత్వం దిగివచ్చింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు చేసిన నిరసనకు ఫలితం దక్కింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్‌లో రెవెన్యూ అధికారులపై దాడులసంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. విజయారెడ్డి ఘటన తర్వాత ఆందోళనబాట పట్టిన రెవెన్యూ సిబ్బందికి పలు రక్షణ వలయాలు కల్పించింది. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. వ్యక్తిగతంగా తహాసీల్దార్లకు పోలీలసును కేటాయించింది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి రెవెన్యూ కార్యాలయానికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.

విజయారెడ్డి హత్యతో ఆందోళన

విజయారెడ్డి హత్యతో ఆందోళన


అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి దారుణంగా మృత్యువాత పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రెవెన్యూ విభాగంలో పలు మార్పులు చేటుచేసుకున్నాయి. ఇటివల జరిగిన జరిగిన సంఘటనలో ఎలాంటీ రక్షణ లేకపోవడంతో విజయారెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు బెదిరింపులు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళన వ్యక్తం చేసిన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. తమ రక్షణతోపాటు రెవెన్యూలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజులపాటు కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన బాట పట్టారు.

సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు...

సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు...


దీంతో ఉద్యోగుల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా రెవెన్యూ శాఖ అదేశాలు జారీ చేసింది. రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఎమ్మార్వో ఆర్డీఓ కార్యాలయాల్లో అగ్నిమాపక పరికరాలు కూడ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది. తక్షణమే కలెక్టర్ల వద్ద ఉన్న నిధుల నుండి వాటిని కొనుగోలు చేయాలని సూచించింది.

ఫిర్యాదులకు ప్రత్యేక సమయం

ఫిర్యాదులకు ప్రత్యేక సమయం

తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహానం చేసిన సురేశ్ ఫిర్యాదుల దినమైన సోమవారం కావడంతో కార్యాలయం సందడిగా మారింది. అదే అదనుగా ఆఫీస్‌లోకి పెట్రోల్ డాబ్బాతో నిందితుడు సురేశ్ ఈజీగా తహసీల్దార్ గదిలోకి నేరుగా వెళ్లి, ఆమెపై పెట్రోల్ పోసీ నిప్పంటించి తాపిగా బయటకు వచ్చాడు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సమయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల సమయంలో రెవెన్యూ సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. చట్టాలపై అవగాహాన లేని ప్రజలు వచ్చినప్పుడు .. రెవెన్యూ సిబ్బంది సమస్యను విని.... పరిష్కారానికి కృషి చేయాలని సూచింంచింది.

పోలీసు భద్రతతో ప్రజలు స్వేచ్చగా వెళతారా...?

పోలీసు భద్రతతో ప్రజలు స్వేచ్చగా వెళతారా...?

అయితే...రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లే వారు పోలీసుల అనుమతితోనే ఎమ్మార్వోనుగాని, ఇతర అధికారులను గాని కలిసే అవకశాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు స్వేచ్చగా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ప్రజలు ఆయా మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళితేనే అధికారులు, సిబ్బంది పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. ఇక వారికి భద్రత మంచిదే అయినా... దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను కనీసం కార్యాలయాల్లో ప్రవేశం కల్పించడంతో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పోలీలసు భద్రత ఏమేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+