వ్యాఖ్యలు: బిజెపి ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీస్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే టి రాజాసింగ్ హైదరాబాద్ పశ్చిమ మండల పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాజాసింగ్ ఈనెల 24న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.‘దాండియా కార్యక్రమంలో హైందవేతరులను అనుమతించవద్దు' అంటూ ఆయన ఆ సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్టుగా మరుసటి రోజు దినపత్రికల్లో ప్రచురితమైంది.

Police serves show cause notice to BJP MLA

మత సామరస్యాన్ని దెబ్బతీసేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయంటూ పశ్చిమ మండల పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన రెండు రోజుల్లోగా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద యెత్తున హైదరాబాదులో దాండియా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బహుళ సంస్కృతికి అద్దం పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+