వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రోన్ కెమెరాలకు చిక్కితే అంతే సంగతులు ... కేసులు పెట్టి లోపలేస్తామని పోలీసుల వార్నింగ్

|
Google Oneindia TeluguNews

కరోనాపై దేశం లాక్ డౌన్ ప్రకటించి మరీ పోరాటం చేస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రం సైతం కరోనాను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది . ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టం చెయ్యాలని భావిస్తున్న తెలంగాణా సర్కార్ ఆ దిశగా పోలీసులకు ఆదేశాలు జారీ చెయ్యటంతో డ్రోన్లను రంగంలోకి దించింది తెలంగాణా పోలీస్ .

2019 మార్చి బిల్లు ఇప్పుడు కట్టండి .. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు.. షాక్ లో వినియోగదారులు2019 మార్చి బిల్లు ఇప్పుడు కట్టండి .. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు.. షాక్ లో వినియోగదారులు

డ్రోన్ ల ద్వారా శానిటైజ్..డ్రోన్ కెమెరాలతో నిఘా

డ్రోన్ ల ద్వారా శానిటైజ్..డ్రోన్ కెమెరాలతో నిఘా

తాజాగా పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు . డ్రోన్ ల ద్వారా శానిటైజ్ చెయ్యటమే కాదు , డ్రోన్ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొనే పనిలో ఉన్నారు . ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పినా వినని కొందరు పోకిరీల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలా రోడ్ల మీద గుమిగూడి ఉంటున్న వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ లో పోకిరీలను బయట తిరగకుండా చెయ్యటానికి డ్రోన్ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి.

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరా విజువల్స్ రిలీజ్ చేసిన పోలీసులు

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరా విజువల్స్ రిలీజ్ చేసిన పోలీసులు

ఇక తాజాగా హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగించిన డ్రోన్ కెమెరా ఎఫెక్ట్ తో అక్కడి వారు ఎక్కడి వాళ్ళు అక్కడే పరార్ అవుతున్నారు . ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్‌ ను మీడియాకు రిలీజ్ చేసింది పోలీస్ శాఖ .ఇక ఆ వీడియోలో కొంత మంది గుమిగూడి ముచ్చటించుకుంటున్న యువకులు డ్రోన్ కెమెరా చూడగానే పరుగులు పెడుతున్నారు. అందుకే పోలీసులు గుంపులుగా బయట తిరిగితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు . డ్రోన్ కెమెరాలో విజువల్ రికార్ అయ్యాక తప్పించుకోలేరు అంటున్నారు పోలీసులు . ప్రజలను బయటకు రాకుండా ఉంచేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించిన పోలీసులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు .

Recommended Video

AP Lockdown :15 New కరోనా Cases In AP,Total Cases 329
ప్రజలు నిబంధనలు పాటించకుంటే డ్రోన్స్ ద్వారా పని పడతామని హెచ్చరిక

ప్రజలు నిబంధనలు పాటించకుంటే డ్రోన్స్ ద్వారా పని పడతామని హెచ్చరిక

ఎక్కడైనా సరే పబ్లిక్ ఉన్నట్లు తెలిస్తే సమాచారం వెంటనే తమకు సమాచారం అందించాలని చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో వారిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 డ్రోన్ కెమెరాల ద్వారా జన సంచారాన్ని సమీక్షిస్తామని కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లోనూ డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. అటు శానిటైజ్ చెయ్యటానికి మాత్రమే కాకుండా జులాయిగా రోడ్ల మీద తిరుగుతూ లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తున్న వారికి చుక్కలు చూపించేందుకు కూడా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు.

English summary
Commissioner of the Cyberabad Commissionerate, V.C Sajjanar, said that all 12 drone cameras will be reviewed. Drone cameras are being used not only in Hyderabad but also in areas where corona-positive cases are high. Drones are also being used to not only sanitize but also to spot those who disobey the lockdown rules on the roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X