వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ మైండ్ గేమ్.. పోటాపోటీగా సర్వేలతో బడా ప్లాన్!!

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు మైండ్ గేమ్ ఆడడం గులాబీ బాస్ కేసీఆర్ కు మాత్రమే తెలిసిన విద్య. కానీ ఇప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. రానున్న ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్న అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీపై మరొక పార్టీ బురద చల్లుతూ ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. వారి తప్పులను, వారికి ఉన్న మైనస్ లను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సర్వేల పేరుతో రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి.

సర్వేలతో ఓటర్లలో కన్ఫ్యూజన్

సర్వేలతో ఓటర్లలో కన్ఫ్యూజన్

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన అనేక సర్వేలలో ఎవరికి వారు మేమంటే మేము బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే గులాబీ జెండా ఎగురుతుంది అని గులాబీ పార్టీ నేతలు చెబుతుంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే 70 స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్తుంది. ఇక వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని, ఎగిరేది కాషాయ జెండానేనని బిజెపి నేతలు చెబుతున్నారు. దీంతో ఓటర్ల లోనూ అసలు సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతుంది.

కేవలం మైండ్ గేమ్ లో భాగంగానే సర్వేలు

కేవలం మైండ్ గేమ్ లో భాగంగానే సర్వేలు

ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన ఓటర్లు చివరి నిమిషం వరకు ఎవరికి ఓటు వేస్తారో ఎవరు చెప్పలేరు. అప్పటి పరిస్థితిని బట్టి, అప్పుడు ఉన్న వేవ్ ని బట్టి, ఆయా స్థానాలలో ఉన్న అభ్యర్థులను బట్టి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఓటర్ నాడి ఇప్పుడే పసిగట్టినట్టు అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు, ఇన్ని సీట్లు వస్తాయి అంటూ నెంబర్ గేమ్ ఆడడం రాజకీయ పార్టీలు ఓటర్లతో ఆడుతున్న మైండ్ గేమ్ అని భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ఒక దానిపై ఒకటి మైండ్ గేమ్ ఆడుతున్నాయని చర్చ జరుగుతుంది.

పక్క పార్టీలను టెన్షన్ పెట్టటం, ప్రజల్లో బలంగా ఉన్నామన్నసంకేతాలు పంపటమే లక్ష్యం

పక్క పార్టీలను టెన్షన్ పెట్టటం, ప్రజల్లో బలంగా ఉన్నామన్నసంకేతాలు పంపటమే లక్ష్యం


తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఒకదానితో ఒకటి మైండ్ గేమ్ ఆడుతూ ఒక పార్టీ ఆత్మవిశ్వాసాన్ని మరో పార్టీ దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయని తెలుస్తుంది. ఈ మూడు పార్టీలు ప్రజల్లో తన పరపతి పెరుగుతోందని చూపించే ప్రయత్నం చేస్తూ, ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇక మూడు పార్టీలు చేస్తున్న సర్వేల ప్రకటనలు ఓటర్లను తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తున్నాయి. పక్క పార్టీలను టెన్షన్ పెట్టటం, ప్రజల్లో బలంగా ఉన్నామన్న సంకేతాలు పంపటమే లక్ష్యంగా పని చేస్తున్నాయి.

పీకే టీం సర్వేలు టీఆర్ఎస్ కోసం.. కాంగ్రెస్ కోసం రంగంలోకి కనుగోలు సునీల్

పీకే టీం సర్వేలు టీఆర్ఎస్ కోసం.. కాంగ్రెస్ కోసం రంగంలోకి కనుగోలు సునీల్

టిఆర్ఎస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ తో పాటు, మరి కొన్ని సర్వే సంస్థలు సర్వేలు కొనసాగిస్తున్నాయి. కొద్ది చోట్ల ఎమ్మెల్యేలను మార్చి, ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తే మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ టీం నిర్వహిస్తున్న సర్వేలో తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీ తన సొంత సర్వే ఫలితాలను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహ కర్తగా వ్యవహరిస్తున్న కనుగోలు సునీల్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పినట్టుగా తెలుస్తుంది. గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో మరింత బలపడుతుందని సూచించినట్లుగా సమాచారం.

బీజేపీ తామే గెలుస్తామంటూ తమ ఓటింగ్ శాతం పెరిగిందంటూ ప్రకటనలు

బీజేపీ తామే గెలుస్తామంటూ తమ ఓటింగ్ శాతం పెరిగిందంటూ ప్రకటనలు


ఇక బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలతో బిజెపి గ్రాఫ్ తెలంగాణ రాష్ట్రంలో మరింత పెరిగిందని, టిఆర్ఎస్ అసమర్థ పాలనతో విసిగిపోయిన ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికలలో బిజెపి తెలంగాణలో మరింత బలపడుతుందని ఇప్పటికే ప్రకటనలు చేస్తోంది. ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో తాము బలంగా ఉన్న మరి చెప్పడం ద్వారా ప్రజల దృష్టి పడేలా చేస్తున్నారు. ప్రజలకు తమ పార్టీపై నమ్మకం కలిగేలా రాజకీయ నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

పార్టీ మారాలనుకునేవారు డైలమాలో..

పార్టీ మారాలనుకునేవారు డైలమాలో..

సర్వే ఫలితాల పేరుతో ఆడుతున్న ఈ మైండ్ గేమ్ తో అసలు అసంతృప్తులు పార్టీ మారాలనుకునే వారు ఎవరైనా ఉంటే వారు ఏ పార్టీకి మారాలి అన్న విషయం పై గందరగోళానికి గురవుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తుంది. రెండుసార్లు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టగా, మూడవ సారి అధికారం చేజిక్కించుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ, ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దింపాలని కాంగ్రెస్, బిజెపి లు ఇప్పటి నుంచే రకరకాల ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు.

English summary
All parties playing a Political mind game in Telangana. TRS, BJP, Congress to compete with big plan with surveys and creating hype to them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X