జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలక మలుపు తిరిగిన రాజకీయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నిక ఫలితంపై భారత రాష్ట్ర సమితి మనుగడ ఆధారపడివుంది. జూబ్లీహిల్స్ లో సెటిలర్లు ఎక్కువగా ఉండటంవల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎన్టీఆర్, చంద్రబాబుపై పోటీలు పడి పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సెటిలర్లు ఎటువైపు అనేది సస్పెన్స్
సాధారణంగా ఉప ఎన్నిలన్నీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్దేశించేది కావడంతో కాంగ్రెస్ తో పోటీపడుతూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. పార్టీకి చావుబతుకుల సమస్య కాబట్టి, కేసీఆర్ తగ్గేదేలే అంటూ.. నందిహిల్స్ లో కూర్చొని దగ్గరుండి రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న సెటిలర్లు కూడా ఎవరికి ఓటేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తనను తాను నిరూపించుకోవడానికి ఏం చేస్తారో మనం వేచిచూద్దాం.

ముస్లింల ఓట్లపై ఆధారపడ్డ జూబ్లీహిల్స్
గోపీనాథ్ మరణం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆయన చనిపోలేదు.. చంపేశారంటూ ఆయన తల్లి ఆరోపిస్తోంది. ఈ మాటలకు బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గోపీనాథ్ మొదటి భార్య కుటుంబం కాకుండా రెండో భార్యను నిలబెట్టడం, ఎందుకైనా మంచిదని పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డితో మరో నామినేషన్ వేయించడం లాంటి అంశాలు కేటీఆర్ పై, కేసీఆర్ పై అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటినుంచి 2014 వరకు టీడీపీలో ఉంటూ గెలుపొందుతూ వచ్చిన గోపీనాథ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం గత్యంతరం లేక బీఆర్ఎస్ లో చేరారు. ఆయన మృతిచెందిన విషయంలో అనేక కీలక మలుపులున్నాయని ఇప్పుడు తెలుస్తోంది.
ఇందులో కేటీఆర్ పాత్ర ఏమిటి అనేది త్వరలోనే తేలుతుంది. అలాగే నాలుగు లక్షల ఓటర్లలో 80వేలు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మజ్లిస్ ఎవరికి మద్దతిస్తే వారికే వేస్తారు. ఆ పార్టీతో ఒప్పందం మేరకే రేవంత్ నవీన్ యాదవ్ ను నిలబెట్టారు. అక్బరుద్దీన్ ఒవైసీ తన ఓటుబ్యాంకును బీఆర్ఎస్ వైపు మళ్లిస్తాడా? లేదంటే కాంగ్రెస్ వైపు మళ్లిస్తాడా? అనేదానిపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ఆధారపడివుంది.












Click it and Unblock the Notifications