పోలింగ్ ..చింతమడకలో కేసీఆర్ , బంజారా హిల్స్ లో కేటీఆర్ , సోమాజీ గూడాలో నరసింహన్
Recommended Video

Lok Sabha Elections 2019 : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!! || Oneindia Telugu
దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత సొంత ఊరు చింతమడకకు రావటం ఇదే తొలిసారి.హైదరాబాద్ నుంచి మరికాసేపట్లో హెలికాప్టర్‌లో చింతమడక చేరుకోనున్న కేసీఆర్ దంపతులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.

ఇక కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకుంటారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఉదయం 9 గంటలకు సోమాజీగూడ ఎంఎస్ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు .












Click it and Unblock the Notifications