వైఎస్ షర్మిల గెలిచేనా: జగన్ సన్నిహితుడికి పాలేరు కాంగ్రెస్ టికెట్..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా వెలువడింది. 45 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. కీలక నియోజవర్గాలు, అదే స్థాయిలో సీనియర్ల పేర్లు ఇందులో ఉన్నాయి. మధుయాష్కీ గౌడ్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహ్మద్ అజరుద్దీన్, పీ విజయారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి.. వంటి సీనియర్ల పేర్లు రెండో జాబితాలో ఉన్నాయి.

లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని కేటాయించింది కాంగ్రెస్. ఈ స్థానం నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. పోటీ చేయదలిచిన నియోజకవర్గం కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ఆమె చాలా సందర్భాల్లో ప్రకటించారు. అక్కడే పార్టీ కార్యాలయాన్నీ నిర్మించారు. వైఎస్ఆర్టీపీ ఖమ్మం జిల్లా రాజకీయ కార్యకలాపాలు పాలేరు కేంద్రంగా సాగుతున్నాయి.

ఇదే స్థానం నుంచి పొంగులేటి రేసులో నిల్చోవడం ఆసక్తి రేపుతోంది. వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా పేరుంది పొంగులేటికి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్‌లో చేరబోయే ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను స్వయంగా కలిశారాయన.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచీ గెలిచారు. అలాంటి నాయకుడు వైఎస్ షర్మిల మీద పోటీకి దిగబోతోన్నారు. తెలంగాణలో రసవత్తరంగా మారబోయే అసెంబ్లీ ఎన్నికల పోరులో ఇక పాలేరు కూడా చేరినట్టయింది. ఇక్కడ గెలుపెవరిదనేది ఉత్కంఠతను రేపుతోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications