జూబ్లీహిల్స్ లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. లీడ్ ఎవరంటే ???
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం లెక్కింపు ప్రక్రియ ఈరోజు ( నవంబర్ 14, 2025 ) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ ప్రారంభంలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. పోస్టల్ ఓట్ల ఫలితాలు స్వల్ప ఆధిక్యతను సూచించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 15 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 9 ఓట్లు వచ్చాయి. పోస్టల్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.

నవీన్ యాదవ్: 15
మాగంటి సునీత: 12
లంకల దీపక్ రెడ్డి: 9
ఇక పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు పూర్తైన తరుణంలో అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) లెక్కింపును ప్రారంభించారు. ఈవీఎంల సీల్స్‌ను తెరచి, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తి అవ్వగా ప్రధాన అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.
తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. షేక్ పేట డివిజన్‌లో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు.. బీఆర్ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications